Share News

Twitter bird logo: ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగో వేలం వేసిన ఎక్స్.. ఎంత ధరకు అమ్ముడుపోయిందంటే..

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:37 PM

Twitter bird logo: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను వేలం వేసింది. ఆక్షన్‌లో ఈ నీలి పక్షి ఎంత ధర పలికిందంటే..

Twitter bird logo: ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగో వేలం వేసిన ఎక్స్.. ఎంత ధరకు అమ్ముడుపోయిందంటే..
Twitter bird logo auction

Twitter bird logo: ట్విట్టర్ పేరు చెప్పగానే అందరికీ ముందుగా అందమైన నీలి పక్షి లోగో కళ్ల ముందు మెదులుతుంది. ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత సీన్ మారిపోయింది. పేరు ట్విట్టర్ నుంచి ఎక్స్ గా మార్చడం సహా అనేక మార్పులు చేశాడు. తాజాగా ఇప్పుడు ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను వేలం వేసింది ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్. అరుదైన వస్తువులను వేలం వేసే ‘ఆర్‌ఆర్‌ ఆక్షన్‌’ సంస్థ ఇటీవల నిర్వహించిన వేలంలో ట్విట్టర్ బర్డ్ లోగోను వేలం వేసినట్లు ధృవీకరించింది. ఇంతకీ, ప్రసిద్ధ ట్విట్టర్ లోగో వేలంలో ఎంత ధరకు అమ్ముడుపోయిందంటే..


వేలంలో ఎంత పలికిందంటే..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ 2022 అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లతో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అనేక మార్పులు చేశారు. ముందుగా పేరును ’ఎక్స్’గా రీబ్రాండ్ చేశారు. ఆ తర్వాత ట్విట్టర్ కంపెనీకి చెందిన 75 శాతం ఉద్యోగులను తొలగించడంతో పాటు ఆఫీస్ ఫర్నిచర్, వంటగది సామాన్లు సహా అనే విలువైన పాత జ్ఞాపకాలను ఎక్స్ కంపెనీ వేలం వేసింది. ఇది జరిగి కొద్ది నెలలకే శాన్‌ఫ్రాన్సిస్కోలోని హెడ్‌క్వార్టర్‌ వద్ద కనిపించే ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను వేలానికి పెట్టారు. ‘ఆర్‌ఆర్‌ ఆక్షన్‌’ సంస్థ నిర్వహించిన వేలంలో 12 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 254 కిలోల బరువు గలం ట్విట్టర్ గుర్తు దాదాపు రూ.30 లక్షలకు (35వేల డాలర్లకు) అమ్ముడైనట్లు తెలుస్తోంది. వేలంపాటలో ఈ గుర్తును దక్కించుకున్న వ్యక్తి పేరు బయటికి వెల్లడించలేదు.


ట్విట్టర్ పక్షి లోగోకు బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు లారీ బర్డ్ పేరు మీద "లారీ" అని పేరు పెట్టారు . 2023లో మస్క్ ప్లాట్‌ఫామ్‌ను X గా రీబ్రాండ్ చేసే వరకు ఇదే కంపెనీ లోగోగా ఉండేది. 2012 నుండి 2023 వరకు ట్విట్టర్ కంపెనీ చిహ్నంగా ఉండేది.


Read Also : Bank Unions : బ్యాంకుల సమ్మె వాయిదా'

Post Office Scheme: వినియోగదారులకు అలెర్ట్.. ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌కు ఎండ్‌కార్డ్.. దరఖాస్తుకు కొన్ని రోజులే సమయం..

UPI New Rules: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ ఫోన్ నెంబర్లలో UPI సర్వీసెస్ బంద్..

Updated Date - Mar 22 , 2025 | 01:22 PM