Share News

UPI Services Down : సర్వర్ డౌన్.. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఫోన్ పే, గూగుల్ పే పేమెంట్లు..

ABN , Publish Date - Apr 12 , 2025 | 02:38 PM

UPI Services Down : మళ్లీ దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం నెలకొంది. గూగుల్ పే, ఫోన్ పే వాడే వేలాది మంది వినియోగదారులు యాక్సెస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

UPI Services Down : సర్వర్ డౌన్.. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఫోన్ పే, గూగుల్ పే పేమెంట్లు..
UPI Services Down

UPI Services Down : శనివారం ఉదయం నుంచి భారతదేశం అంతటా UPI సేవలలో పెద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. దీని వలన వినియోగదారులు డిజిటల్ లావాదేవీలు చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఊహించని అంతరాయం కారణంగా UPI పనిచేయకపోవడంతో రోజువారీ వ్యాపారాలు నిర్వహించేవారు, సామాన్య ప్రజలు డిజిటల్ పేమెంట్లు చేయలేక, పొందలేక నానా అగచాట్లు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మధ్య యూపీఐ చెల్లింపులపైనే ఆధారపడటం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. DownDetector నివేదికల ప్రకారం, మధ్యాహ్నం నాటికి UPI సమస్యల గురించి దాదాపు 1,168 ఫిర్యాదులు వచ్చాయి. రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందంటూ యూజర్ల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై NPCI స్పందించింది. UPI ప్రస్తుతం అడపాదడపా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోందని.. దీనివల్ల UPI లావాదేవీలు పాక్షికంగా తగ్గుతున్నాయని అంగీకరించింది. సమస్యను పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని పేర్కొంది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు NPCI అధికారులు తెలిపారు.


వేలాది మంది PhonePe, Google Pay వినియోగదారులు UPI సేవను యాక్సెస్ చేయలేకపోతున్నారు. చేతిలో క్యాష్ లేకపోవడంతో కొనుగోలు, విక్రయాల చెల్లింపుల విషయంలో దేశవ్యాప్తంగా యూజర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. డౌన్‌డెటెక్టర్‌, సోషల్ మీడియా వేదికగా వేలాదిమంది UPI సేవల్లో అంతరాయం గురించి వరస పోస్టులు, ఫిర్యాదులు పెడుతూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ప్రజలు రోజువారీ లావాదేవీల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)పై ఎంతలా ఆధారపడ్డారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వైఫల్యానికి కారణం ఇంకా తెలియరాలేదు. సర్వర్ ఓవర్‌లోడ్‌లు, షెడ్యూల్ నిర్వహణ లేదా సైబర్ భద్రతా సమస్యలు ఇందుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. చివరిసారిగా మార్చి 26న ఇదే తరహాలోనే దాదాపు 2 నుండి 3 గంటల పాటు యూపీఐ సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. కేవలం 2 వారాల వ్యవధిలోనే మరోసారి ఇదే తరహా ఇబ్బందులు ఎదురవడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇటీవల ఏప్రిల్ 8న, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక నోటీసు జారీ చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చేసే అంతర్జాతీయ లావాదేవీల కోసం వినియోగదారులు QR కోడ్‌ని ఉపయోగించి షేర్ చేయడం, చెల్లింపు చేసే ఫీచర్ రద్దు చేసింది. పేమెంట్లు చేసేందుకు ఉపయోగించే యాప్ యూజర్ ను సరిగ్గా గుర్తించేందుకే ఈ మార్పు తీసుకొచ్చింది. అయితే, ఇండియాలో చెల్లింపుల కోసం QR కోడ్‌ సహా ఇతర UPI లావాదేవీలకు ఎలాంటి పరిమితులు ఉండవు.


Read Also: Gold Prices Surge: మళ్లీ షాకిచ్చిన గోల్డ్ ధరలు..లక్షకు చేరుతుందా..

Layoffs Update: ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..మళ్లీ జాబ్స్ తొలగింపు, కానీ గూగుల్, టీసీఎస్ కాదు..

Ram Charan: రిలయన్స్ కాంపా బ్రాండ్ అంబాసిడర్‎గా

Updated Date - Apr 12 , 2025 | 02:54 PM