Share News

Darshan: కారు పార్కింగ్‌ తెచ్చిన తంటా.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ దర్శన్‌ అరెస్టు

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:39 PM

కారు పార్కింగ్ విషయంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటుడు దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు, ఆయన భార్య, అత్తతో దర్శన్‌ గొడవకు దిగి వారిపై దాడికి పాల్పడ్డాడని అందిన ఫిర్యాదుతో పోలీసులు దర్శన్‌ను అరెస్ట్ చేశారు.

Darshan: కారు పార్కింగ్‌ తెచ్చిన తంటా.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ దర్శన్‌ అరెస్టు

చెన్నై: కారు పార్కింగ్‌కు సంబంధించి జరిగిన గొడవలో హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు, ఆయన భార్య, అత్తపై దాడి చేశారనే ఆరోపణపై బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటుడు దర్శన్‌(Actor Darshan)ను పోలీసులు అరెస్టు చేశారు. ముగప్పేర్‌లో దర్శన్‌ ఇంటిముందు గురువారం సాయంత్రం కారు పార్కింగ్‌ చేసేందుకు ప్రయత్నించిన న్యాయమూర్తి కుమారుడు, ఆయనభార్యపై దర్శన్‌, అతడి సహచరుడు లోకేష్‌ కలిసి దాడి చేసినట్లు జేజే నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ దార్తను కూడా చదవండి: Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ భేటీ


nani3.2.jpg

గాయపడిన న్యాయమూర్తి కుమారుడు, ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో దర్శన్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తనతో గొడవకు దిగిన న్యాయమూర్తి కుమారుడిపై దర్శన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


nani3.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

చెడగొట్టు వానకు రైతు విలవిల!

ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ

రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 05 , 2025 | 01:40 PM