Share News

Hyderabad: రూ.5 లక్షలివ్వండి.. రూ.10 లక్షలిస్తా

ABN , Publish Date - Jan 19 , 2025 | 12:30 PM

నకిలీ కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్న విదేశీయుడిని పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. జీన్‌ పేరుతో ఉన్న కామెరూన్‌ దేశం పాస్‌పోర్టు, ఒక సెల్‌ఫోన్‌, నాలుగు 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: రూ.5 లక్షలివ్వండి.. రూ.10 లక్షలిస్తా

- నకిలీ కరెన్సీతో విదేశీయుడి మోసాలు

- అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్: నకిలీ కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్న విదేశీయుడిని పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. జీన్‌ పేరుతో ఉన్న కామెరూన్‌ దేశం పాస్‌పోర్టు, ఒక సెల్‌ఫోన్‌, నాలుగు 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్‌ సీఐ నాగరాజుగౌడ్‌(Hayathnagar CI Nagaraju Goud) తెలిపిన వివరాల మేరకు.. కామెరూన్‌ దేశానికి చెందిన జాక్వస్‌ దేవలూయిస్‌ కిట్‌ (42) రెండు నెలల టూరిస్టు వీసాపై 2017లో ఇండియాకు వచ్చాడు. వీసా ముగిసినప్పటికీ బెంగళూరులోని శాంతినగర్‌ హోర్‌మావులో ఉంటున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హేళన చేస్తున్నాడని కడతేర్చారు..


city3.jpg

అప్పటి నుంచి దేవలూయిస్‌ కిట్‌ నకిలీ కరెన్సీ పేరుతో పలువురిని మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో 2020లో కర్ణాటక(Karnataka) పోలీసులు నకిలీ కరెన్సీ వ్యవహారంలో దేవలూయిస్‌ను అరెస్టు చేశారు. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు తన స్నేహితుడు లాండ్రితో కలిసి అదే పనిని తిరిగి చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో హయత్‌నగర్‌కు చెందిన రసూల్‌ వారి వలలో పడ్డాడు. రూ.5 లక్షల ఒరిజినల్‌ నోట్లు ఇస్తే రూ.10 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తానని దేవలూయిస్‌ కిట్‌ రసూల్‌కు చెప్పాడు.


దీంతో రసూల్‌ హయత్‌నగర్‌(Hayatnagar) రావాలని చెప్పడంతో దేవలూయిస్‌, అతడి స్నేహితుడు లాండ్రి శనివారం భాగ్యలత అరుణోదయనగర్‌ కాలనీలోని ఓ లాడ్జికి వచ్చారు. వారి వ్యవహారంపై అనుమానం వచ్చిన రసూల్‌ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో లాడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు దేవలూయిస్‌ కిట్‌ను అదుపులోకి తీసుకోగా, లాండ్రి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 19 , 2025 | 12:30 PM