Hyderabad: నా కోసం వెతకొద్దు.. తనువు చాలిస్తున్నా
ABN , Publish Date - Mar 11 , 2025 | 08:41 AM
క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ మహిళ నా కోసం వెతకొద్దు.., కాశీకి వెళ్లి తనువు చాలించాలనుకుంటున్న భర్తకు మెసెజ్ చేసి కనిపించకుండా పోయిన విషాధ సంఘటన ఇది. ఆయన వెంటనే విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియపరచంతో ఆమె జాడ కనుగొనేందుకు అందరూ కలిసి కాశీకి వెళ్లారు.

- భర్తకు వీడియో కాల్ చేసిన భార్య
- రెండు రోజులుగా వెతుకుతున్నా దొరకని ఆచూకీ
హైదరాబాద్: ‘నాకు క్యాన్సర్ ఉంది.. నేను కోలుకోలేను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే నేను కాశీకి వెళ్లి తనువు చాలించాలని అనుకుంటున్నా. నాకోసం వెతకకండి. బాబును స్కూలు వద్ద దింపి వెళుతున్నా..’ అంటూ భర్తకు మెసేజ్ ద్వారా సమాచారం ఇచ్చి ఓ ఇల్లాలు అదృశ్యమైంది. ఈ ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్(Balanagar Police Station)లో ఆలస్యంగా వెలుగు చూసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఈ ఘటన చోటుచేసుకున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
ఈ వార్తను కూడా చదవండి: MLC Kavitha: మహిళలకు ఎమ్మెల్సీ కవిత సూచన.. ఆమె ఏమన్నారంటే..
వివరాలిలా ఉన్నాయి.. బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి బాల్‌రెడ్డినగర్‌లో ధన్యాకుల రమేష్‌బాబు, ఉమారాణి (40) దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు ఉన్నాడు. కొంత కాలంగా ఉమారాణి క్యాన్సర్‌తో బాధపడుతున్నది. చికిత్స చేయించుకుంటున్నా నయం కావడం లేదనే మనోవ్యధతో ఆవేదన చెందుతుండేది. అయితే, భర్తను కష్టపెట్టవద్దని మహిళా దినోత్సవం (మార్చి 8న) రోజున నిర్ణయం తీసుకుంది. బాబును స్కూలుకు తీసుకెళ్తున్నానని భర్తకు చెప్పి సెల్‌ఫోన్‌తో వెళ్లింది.
డ్యూటీకి ఆలస్యం అవుతుండడంతో ఇంటికి తాళం వేసి భర్త ఆఫీసుకు వెళ్లిపోయాడు. అయితే, మధ్యాహ్నం 12.47 గంటలకు భర్తకు వీడియో కాల్ చేసి ‘నా అనారోగ్యం కారణంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని నిర్ణయించుకున్నాను. నేను తనువు చాలించాలనుకుంటున్నాను. కాశీకి వెళుతున్నా.. నాకోసం వెతకొద్దు..’ అంటూ 3 నిముషాలు మాట్లాడి సెల్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆ వెంటనే పలు చోట్ల వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో రమేష్ బాబు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాశీకి వెళ్లి వచ్చిన పోలీసులు..
ఉమారాణి ఫోన్ నెట్‌వర్క్ ఆధారంగా బాలానగర్ పోలీసులు కాశీకి వెళ్లారు. అక్కడి పోలీసులతో కలిసి ఆమె కోసం వెతుకున్నట్లు సమాచారం. అయితే, ఉమారాణి సెల్ నెట్‌వర్క్ చివరిసారిగా కాశీ చూపించినప్పటికీ ఎటువంటి అఘాయిత్యం చేసుకుని ఉండదని భావిస్తున్నారు. మరెక్కడికైనా వెళ్లిందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వార్తలను కూడా చదవండి:
Harish Rao: సీఎం రేవంత్ రాజీనామా చేయాలి
కాళేశ్వరం నీరందకనే ఎండుతున్న పంటలు
కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్
Read Latest Telangana News and National News