Share News

Hyderabad: ఎండీఎంఏ డ్రగ్స్‌, ఓజీ కుష్‌ గంజాయి పట్టివేత

ABN , Publish Date - Feb 07 , 2025 | 07:16 AM

నగరంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ (స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌) 25 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌, 8 గ్రాముల ఓజీ కుష్‌ (మేలు రకం అమెరికా గంజాయి), 2.6కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: ఎండీఎంఏ డ్రగ్స్‌, ఓజీ కుష్‌ గంజాయి పట్టివేత

- మరో కేసులో 2.6 కేజీల గంజాయి స్వాధీనం

- రెండు కేసుల్లో ఐదుగురు నిందితుల అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: నగరంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ (స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌) 25 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌, 8 గ్రాముల ఓజీ కుష్‌ (మేలు రకం అమెరికా గంజాయి), 2.6కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో కలిపి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఎక్సైజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌(Kacheguda Delhi Public School) సమీపంలో డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్‌ శంషాబాద్‌ ఎస్‌టీఎఫ్‌ టీమ్‌(Excise Shamshabad STF Team) దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 25 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌, 8 గ్రాముల విదేశీ ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 9,10 తేదీల్లో సూరారం- బహదూర్‌పల్లి మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు


డ్రగ్స్‌ను విక్రయిస్తున్న అబ్దుల్లాబిన్‌ అజీజ్‌ బర్వాజ్‌, మహ్మద్‌ ఖలీంలను అరెస్టు చేశారు. వీరి వద్ద బైక్‌, సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ప్రధాన నిందితుడు రషీద్‌ అలీఖాన్‌ పరారీలో ఉన్నట్లు టీమ్‌ లీడర్‌ పవన్‌కుమార్‌ తెలిపారు. అనంతరం పోలీసులు విచారించగా.. ఈ ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్‌ను గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, మణికొండ, బంజారాహీల్స్‌, జూబ్లీహీల్స్‌ పరిధిలో అమ్మకాలు జరుపుతున్నట్లు తేలింది. ఈ ముఠాపై ఇప్పటికే టీజీన్యాబ్‌లో మూడు కేసులు, శేరిలింగంపల్లిలో రెండు కేసులు ఉన్నాయని తెలిపారు.


మరో కేసులో 2.6 కేజీల గంజాయి..

గొల్కొండ, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్‌టీఎఫ్‌ సీఐ వెంకటేశ్వర్లు టీమ్‌ సభ్యులు కలిసి 2.6కేజీల గంజాయి పట్టుకున్నారు. ఎస్టీఎఫ్‏సీ టీమ్‌ సీఐ చంద్రశేఖర్‌ టీమ్‌ సభ్యులు రెండు కేసుల్లో 2.6 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గొల్కోండ ప్రాంతంలో 1.1 కేజీల గంజాయి, కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో మహ్మమద్‌ అస్లమ్‌, మహ్మమద్‌ నజీర్‌లను అరెస్టు చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు

ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్‌ ఎన్నికలకే మొగ్గు

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర

ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2025 | 07:33 AM