Share News

Hyderabad: రూ. 2 కోట్ల విలువైన నగలతో పాన్‌ బ్రోకర్‌ పరార్‌

ABN , Publish Date - Feb 06 , 2025 | 10:07 AM

సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, విలువైన వస్తువులతో ఓ పాన్‌ బ్రోకర్‌ పారిపోయాడు. రాజస్థాన్‌ రాష్ట్రం జోద్‌పూర్‌కు చెందిన ఓం ప్రకాశ్‌(35) బతుకుదెరువు కోసం 2010లో నగరానికి వచ్చాడు.

Hyderabad: రూ. 2 కోట్ల విలువైన నగలతో పాన్‌ బ్రోకర్‌ పరార్‌

హైదరాబాద్: సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, విలువైన వస్తువులతో ఓ పాన్‌ బ్రోకర్‌ పారిపోయాడు. రాజస్థాన్‌ రాష్ట్రం జోద్‌పూర్‌కు చెందిన ఓం ప్రకాశ్‌(35) బతుకుదెరువు కోసం 2010లో నగరానికి వచ్చాడు. జగద్గిరిగుట్ట పోలీస్‏స్టేషన్‌(Jagadgirigutta Police Station) పరిధిలోగల చంద్రగిరినగర్‌లో రాందేవ్‌(Ramdev) పాన్‌బ్రోకర్స్‌ పేరుతో నగల తాకట్టు దుకాణం ఏర్పాటు చేశాడు. అనేకమంది అతడి వద్ద బంగారు నగలు, వెండి వస్తువులు తాకట్టుపెట్టి డబ్బు తీసుకుంటుండేవారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం..


కొందరు వ్యక్తులు అప్పుతీరినా నగలు భద్రంగా ఉంటాయని అతడి వద్దే ఉంచారు. జనవరి 25వ తేదీన ఓంప్రకాశ్‌(Omprakash) గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులతో కలిసి దుకాణం మూసివేసి బంగారు నగలు, వెండి వస్తువులతో పారిపోయాడు. బాధితులు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నగలు, వెండి తదితర విలువైన వస్తువుల విలువ సుమారు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన

ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్‌ డంపుయార్డ్‌ పనులు ప్రారంభం

ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌!

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2025 | 10:07 AM