Hyderabad: ఇంటి విక్రయాన్ని జీర్ణించుకోలేక వివాహిత చేసిన పనేంటో తెలిస్తే..
ABN , Publish Date - Mar 11 , 2025 | 10:14 AM
కష్టపడి కట్టుకున్న ఇంటిని అమ్మడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నగరంలోని జవహర్‌నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య
- జయశంకర్ కాలనీలో ఘటన
హైదరాబాద్: సొంత ఇంటిని అమ్మడంతో మనస్తాపానికి గురైన మహిళ ఓ రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్స్టేషన్(Jawaharnagar Police Station) పరిధిలో సోమవారం జరిగింది. సీఐ సైదయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... జయశంకర్ కాలనీకి చెందిన బీరోజ్ వరలక్ష్మి, పుల్లయ్యచారి దంపతులు. వారికి కుమారుడు, ఇద్దరు కుమార్తె ఉన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు కావడంతో వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్ 1,2,3 ఫలితాలను నిలిపి వేయాలి
వివాహాల కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం రెండు సంవత్సరాల క్రితం ఇంటిని విక్రయించారు. ఇల్లును అమ్మడంతో అప్పటి నుంచి వరలక్ష్మి(Varalakshmi)కి దిగులు పట్టుకుంది. ఈక్రమంలో ఆదివారం ఇంట్లోని రసాయన ద్రావణాన్ని తాగి అపస్మారక స్థితిలోకి చేరింది. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఈ వార్తలను కూడా చదవండి:
Harish Rao: సీఎం రేవంత్ రాజీనామా చేయాలి
కాళేశ్వరం నీరందకనే ఎండుతున్న పంటలు
కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్
Read Latest Telangana News and National News