Rama Navami: శ్రీరామనవమికి ముందు ఈ పనులు చేయాలని మీకు తెలుసా
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:02 PM
Rama Navami: శ్రీరామనవమి రోజున ఇంటిని అందంగా అలంకరించుని పూజలు చేయాలి. ఇంటిని శుభ్రపరిచిన తర్వాత ఆలయానికి వెళ్లడం లేదా ఇంట్లో పూజ చేయడం ద్వారా రామచింతనలో ఉన్నట్లుగా భక్తులు భావిస్తుంటారు. ఈ పండుగ ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. పండుగ రోజు శ్రీరాముని పూజ చేయడం వల్ల స్వచ్ఛత, ధర్మం, సమానత్వం అనే అంశాలను చాటి చెబుతుంది.

శ్రీరామనవమి పండుగ హిందువులకు ఎంతో ప్రధానమైంది. స్వామివారి జీవితం సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమైంది. శ్రీరాముల వారి పూజా విధానాలు, ఇంటి అలంకరణలు, ఉపవాసం, దానధర్మాలు ఇవన్నీ భక్తుల మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. ఈ పండుగలోని అంశాలు, ముఖ్యంగా రామచరిత్ర, శ్రీరాముడి ఆదర్శాలు గురించి తెలుసుకోవడం, కుటుంబంతో కలిసి పూజలు చేయడం, పేదలకు సహాయం చేయడం ఇవన్నీ మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. శ్రీరాముని జీవితంలోని త్యాగం, నిజాయితీ, సామరస్యం లాంటి పాఠాలు మనందరికీ ఎంతో మేలు చేస్తాయి.
ఆనాదిగా వస్తున్న ఆచారం..
రామనవమికి ముందు రోజూ నుంచి రాముల వారి ఆలయాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతారు. ఆలయాలతో పాటు ఇళ్లను కూడా భక్తులు అందంగా అలంకరించుకుంటారు. ఇంట్లో మామిడి తోరణాలు కట్టి చూడముచ్చటగా తయారు చేస్తారు. హిందూవులు చేసుకునే పండుగల్లో శ్రీరామనవమి అత్యంత ప్రధానమైనది. శ్రీరామనవమినే శ్రీరాముడి జన్మదినంగా నిర్వహించుకోవడం ఆనాదిగా వస్తోంది. చైత్ర మాసంలో శుద్ధ నవమి తిథినాడు ఈ పండుగను చేసుకుంటారు. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ నెలలో 6వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. పండుగ రోజు శ్రీరాముల వారి ఆశీస్సులు పొందడానికి భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. శ్రీరామనవమికి ముందు ఎలాంటి పనులు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంటి ముస్తాబు..
పండుగ రోజు ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలి. పండుగ ముందు రోజు ఇంటిని అలంకరించుకోడానికి అవసరమైన సామాగ్రిని తెచ్చుకోవాలి. శ్రీరామనవమి రోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. అనంతరం మార్కెట్ నుంచి తీసుకువచ్చిన మామిడి ఆకులు, పూలతో ఇంటిని అలంకరించుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్రీరాముడు ఇంట్లో కొలువుదీరుతాడని భక్తులు విశ్వసిస్తారు. శ్రీరాముడు స్వచ్ఛత, ధర్మం, సౌమతుల్యతకు ప్రతీతి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే శ్రీరాముడి పూజ ప్రశాంతంగా జరుగుతుందని భక్తులు భావిస్తారు.
పూజ సామాగ్రి ఏర్పాట్లు..
శ్రీరామనవమి రోజు పూజ చేసుకోడానికి అవసరమైన సామాగ్రిని ముందు రోజు మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, దీపం. పూజకు అవసరమైన నువ్వుల నూనే, పూలు, దీపం, వత్తులు, అగరబత్తులు, గుగ్గిలం, శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టడానికి పండ్లు, స్వీట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. స్వామివారి పూజ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా నివారించవచ్చు. ఇలా చేయడం వల్ల పూజ సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా ఉంటుంది. వీలయింనత వరకు కుటుంబంతో ఆలయాలకు వెళ్తేనే వేద బ్రాహ్మణులు చేసే పూజ విధానం, శ్రీరాముల వారి కల్యాణం తెలుస్తోంది. కుదరని వారు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఎక్కువ శాతం ఆలయానికి వెళ్లేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఉపవాసం..
శివరాత్రి తర్వాత శ్రీరామనవమికి భక్తులు ఎక్కువగా ఉపవాసం ఉంటారు. పండుగ ముందురోజు లేదా అదే రోజు ఉపవాసం చేస్తారు. కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రశాంతమైన మనస్సుతో ఉపవాసం చేస్తే దైవచింతనలో ఉండవచ్చని భక్తులు అనుకుంటారు. ఏకాగ్రతతో ఉపవాసం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి, భక్తిభావన పెరుగుతుంది.
శ్రీరామ చర్రిత
శ్రీరాముడి పూజ అనంతరం కుటుంబ సభ్యులు అంతా ఒక దగ్గర కూర్చుని శ్రీరాముడి జీవితం గురించి తెలుసుకోవాలి. రాములవారి జీవిత విషయాలను రామచరిత మానస్, రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఇలా చేయడం వల్ల రాముడి జీవితం, ఆదర్శాలపై మరింత భక్తి పెరుగుతుంది. భక్తులకు శ్రీరాముడి ఆదర్శ భావాలు తెలుసుకోవడం వల్ల సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి.
దానధర్మలు...
ఇంట్లో శ్రీరామనవమి పూజ అనంతరం సాయంత్రం సమయంలో రామాలయానికి వెళ్లి పూజలు చేసి బ్రాహ్మణులతో ఆశీర్వచనాలు తీసుకోవాలి. ఇంటికి తిరుగు క్రమంలో పేదలు ఎవరైనా కనపడితే వారికి ధన, వస్తువు రూపంలో సాయం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీరాముని సేవా గుణాన్ని మరింతగా చాటి చెప్పిన వారమవుతాం. సమాజంలో సమానత్వం, కరుణ భావాన్ని పెంపొదింస్తోంది. ఇలా చేయడం వల్ల మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు
Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి
Zodiac Signs: మీరు ఈ రాశిలో పుట్టారా మీకు బ్యాడ్ టైమ్ స్టార్ కాబోతుందని తెలుసా