White Hair Treatment: తెల్లజుట్టు సమస్య వేధిస్తోందా.. ఈ నూనె ట్రై చేయండి..
ABN , Publish Date - Apr 04 , 2025 | 08:52 PM
ఇటీవల కాలంలో ఎక్కువ మందిని తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. ఎప్పుడో ముసలితనంలో రావాల్సిన వైట్ హెయిర్.. చిన్నపిల్లలు, పెళ్లికాని యువకులకు సైతం వస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక ప్రపంచంలో చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ మందిని తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. ఎప్పుడో ముసలితనంలో రావాల్సిన వైట్ హెయిర్.. చిన్నపిల్లలు, పెళ్లికాని యువకులకు సైతం వస్తోంది. దీంతో వారంతా మానసికంగా కుంగిపోతున్నారు. నలుగురిలోకి రావాలంటేనే సిగ్గుపడుతున్నారు. మార్కెట్‌లో దొరికే వివిధ రకాల హెయిర్ డైలు వాడి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు.
అలాంటి వారందరికీ ఇప్పుడు చెప్పబోయే విషయం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై వారు తెల్లజుట్టుతో బాధపడాల్సిన పని లేదు. ఎటువంటి కెమికల్ రంగులు వేసుకోకుండానే తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా?. ఆ సమస్యకు పరిష్కారం దొరికేసింది. ఎవరో శాస్త్రవేత్తలు, ఎక్కడో మందు కనిపెట్టారని అనుకుంటున్నారా?, అదేం కాదు.. మన పూర్వీకులు ఉపయోగించిన నువ్వుల నూనెతోనే తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆ నూనెను ఎలా తయారు చేయాలి, ఎప్పుడెప్పుడు జుట్టుకు రాయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ముందుగా నువ్వుల నూనె, కరివేపాకు, ఉల్లిపాయ రసం ఈ మూడు కలిపి బాగా మరగబెట్టాలి. అనంతరం దాన్ని వడకట్టాలి. వచ్చిన రసాన్ని జాగ్రత్తగా సీసాలో నిల్వ చేసుకోవాలి. తలస్నానానికి గంట ముందు ఆ ద్రావణాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. వెంట్రుకలకు అన్నింటికీ కలిసేలా కుదుళ్లవరకూ రాయాలి. అలాగే ఓ పది నిమిషాలపాటు మర్దనా చేయాలి. అనంతరం గంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేయాలి. ఇలా కొన్నాళ్లపాటు చేస్తూ పోతే తెల్లజుట్టు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
అంతేకాదు ఈ నువ్వుల నూనెలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో జుట్టుకు మంచి పోషణ అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జుట్టు మందంగా పెరుగుతూ మృదువుగా మారుతుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం వెంటనే నువ్వుల నూనె ట్రై చేసి తెల్లజుట్టును కాస్త నల్లజుట్టుగా మార్చుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి:
Toothbrush: టూత్ బ్రష్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోకపోతే అంతే సంగతులు..
Kazakhstan: చర్చనీయాంశంగా మారిన కజకిస్తాన్ దేశం.. అక్కడ దొరికింది చూస్తే..