మరీ ఇంత బాధా.. ఏమంత పెద్ద కష్టం వచ్చిందని ఇలా చేశావు..
ABN , Publish Date - Apr 04 , 2025 | 08:50 PM
Young Man Shares His Obituary Post: ప్రశాంత్ హరిదాస్ అనే యువకుడు జాబ్ రాలేదన్న బాధతో ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నాడు. నిజం చెప్పాలంటే అతడు చేసిన పని పలువుర్ని కంటతడి పెట్టించింది. అతడు తనకు తానే చనిపోయినట్లు శ్రద్ధాంజలి ఘటించుకున్నాడు.

మనకు చాలా సింపుల్‌గా అనిపించిన కొన్ని విషయాలు.. వేరే వాళ్లకు చాలా కష్టంగా అనిపించవచ్చు. కొంతమంది ఉంటారు.. డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగం చేయాలంటే బద్దకం. ఇంట్లో వాళ్ల మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఇంట్లో వాళ్లు ఎంత కష్టపడుతున్నా కానీ, పట్టించుకోరు. అలాంటి వాళ్లను ఇంట్లో వాళ్లు, సమాజం ఎంత అవమానించినా.. దులుపుకుని వెళ్లిపోతూ ఉంటారు. కొందరి జీవితాలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటాయి. వారు ఉద్యోగం కోసం ప్రయత్నించి, ప్రయత్నించి విసిగెత్తిపోతూ ఉంటారు. ఉద్యోగం లేదన్న కారణంతో ఇంట్లో వాళ్లతో.. బయటి వాళ్లతో అవమానానికి గురవుతూ ఉంటారు.
ఇలాంటి కష్ట సమయంలో మానసికంగా బాగా కృంగి పోయి ప్రాణాలు తీసుకున్నవారు కూడా లేకపోలేదు. తాజాగా, ఓ యువకుడు ఉద్యోగం రాలేదన్న బాధతో ఎవ్వరూ చేయని బాధాకరమైన పనికి పూనుకున్నాడు. తనకు తానే శ్రద్ధాంజలి ఘటించుకున్నాడు. ఈ మేరకు ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్ హరిదాస్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ జాబ్ కోసం అన్వేషిస్తూ ఉన్నాడు. నెలలో నాలుగైదు ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ఇప్పటి వరకు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, లాభం లేకుండా పోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా అతడికి జాబ్ ఇవ్వలేదు.
దీంతో మానసికంగా బాగా కృంగిపోయాడు. బాధాకరమైన పనికి పూనుకున్నాడు. తన లింక్డ్ఇన్ ఖాతాలో ఈ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో తనకు తానే శ్రద్ధాంజలి ఘటించుకుంటూ ఓ ఫొటో కూడా యాడ్ చేశాడు. ‘ నేను చావాలనుకోవటం లేదు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రుచి చూడాల్సిన వంటకాలు చాలా ఉన్నాయి. తిరగాల్సిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఉద్యోగం కోసం వెతికివెతికి చచ్చిపోయాను. ఉద్యోగం సంపాదించి, ప్రియురాలితో హాయిగా గడుపుదామని అనుకున్నాను. దాదాపు మూడేళ్లుగా నిరుద్యోగంతో ఉన్నాను. అది చాలా కష్టమైన పని’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
Raxaul Express: రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో బాలికపై లైంగిక వేధింపులు: బిగ్ ట్విస్ట్
Waqf bill: వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం: ఒవైసీ