IPL 2025 LSG vs MI: ముగిసిన ఎల్ఎస్‌జీ ఇన్నింగ్స్.. ముంబై ఇండియన్స్ లక్ష్యం ఎంతంటే..
ABN , Publish Date - Apr 04 , 2025 | 09:38 PM
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి తన ఇన్నింగ్స్ ముగించింది.

ఇంటర్నట్ డెస్క్: ముంబై టాస్ గెలవడంతో బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి తన ఇన్నింగ్స్ ముగించింది. మిచెల్ మార్ష్ (60, మార్క్రమ్ (53) పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. మార్క్రమ్, మార్ష్ 76 పరుగుల భాగస్వామ్యాం జట్టుకు మంచి స్కోరు అందించడంలో కీలకంగా మారింది. ఇక 31 బంతుల్లో 60 పరుగులు సాధించిన మార్ష్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత నెమ్మదిగా మొదలుపెట్టినా కూడా మార్క్రమ్ తన దైన శైలిలో ఆడుతూ 38 బంతుల్లో 53 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఇక ఎమ్‌ఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. కీలక సమయాల్లో నికొలస్ పూర్, రిషభ్ పంత, మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. ఇక నెట్ ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ మోకాలికి స్వల్ప గాయం కావడంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి