Share News

Final Mission: ఫైనల్ కాదు

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:36 AM

అడవి, ఆదివాసీలు, హింస-ప్రతిహింసల మధ్య తల్లడిల్లుతున్న సమాజాన్ని ప్రశ్నిస్తూ, మానవతా దృక్పథంతో మహెజబీన్ హృదయాన్ని తాకేలా స్పందించారు. ‘శాంతి చర్చలే శాంతికి మార్గం’ అంటూ ఆపరేషన్‌ల ముసుగులో జరుగుతున్న అణచివేతను ప్రశ్నించారు

Final Mission: ఫైనల్ కాదు

చిన్నదాన్ని నేను చిన్నతల నాది అందులో తెలివి ఉందో లేదో తెలీదు లేదనే అనుకుంటున్నాను ఉంటే ఇలా మాట్లాడను కదా! పాతకాలం దాన్ని నేను శాంతి, గాంధీ, అహింస అనుకుంటూ పాత మాటల్ని మననం చేసుకుంటూ తిరుగుతున్నాను అడవిని నమ్మిన దాన్ని నేను అడవి అంటే అమ్మ అడవి అంటే అన్నం అందుకే అడవి అంటే మక్కువ Insurgency, counter-insurgency దశాబ్దాల రక్త చరిత్రను చూసింది అడవి సల్వాజుడుం, గ్రీన్ హంట్, ఆపరేషన్ -సమాధాన్, ఇప్పుడేమో కగార్ – ఫైనల్ మిషన్ హింస ప్రతిహింసల మధ్య తల్లడిల్లిపోతుంది అడవి ఆదివాసీలు అడవి బిడ్డలు పాపం, ఇప్పపూలు రాలినట్టు రాలిపోవడం చూడలేకపోతున్నాను ఆదివాసీలు ప్రజలే కదా! ప్రజలు రాజ్యానికి పిల్లలే కదా! సొంత పిల్లల్ని చంపుకోవడం న్యాయమేనా? Genocide! ఈ ఊచకోత ఎవరి కోసం? ‘శాంతి చర్చలు’ శాంతిని ఇస్తాయి గాని, ‘ఆపరేషన్ సమాధాన్’తో శాంతి వస్తుందా? సెకండ్ సిటిజెన్‌ని నేను తెలీక ప్రశ్నిస్తున్నాను ఏమీ అనుకోవద్దు ముందే చెప్పాను చిన్నతల నాది

- మహెజబీన్

Updated Date - Apr 14 , 2025 | 04:36 AM