Share News

Trump Iran warning: ఆ డీల్‌పై సంతకాలు చేయకపోతే బాంబు దాడులు.. ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక

ABN , Publish Date - Mar 30 , 2025 | 10:05 PM

అణు కార్యక్రమాలకు సంబంధించి తమతో డీల్ కుదుర్చుకోకపోతే ఇరాన్‌పై బాంబు దాడులు చేసేందుకు కూడా వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు.

Trump Iran warning: ఆ డీల్‌పై సంతకాలు చేయకపోతే బాంబు దాడులు.. ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: అణుకార్యక్రమానికి సంబంధించి ఇరాన్ అమెరికాతో ఒప్పందానికి అంగీకరించకపోతే బాంబు దాడులు చేసేందుకు కూడా తాము వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘‘వారు గనక డీల్‌కు ఒప్పుకోకపోతే బాంబు దాడులు జరుగుతాయి. వాళ్లు మునుపెన్నడూ చూడని రీతిలో దాడులు జరుగుతాయి’’ అని ట్రంప్ హెచ్చించారు.

అణు ఒప్పందంపై చర్చల కోసం అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు ఇటీవల లేఖ రాసింది. దీనిపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజ్‌ష్కియన్ తాజాగా స్పందించారు. తామ దేశ అణు కార్యక్రమాలకు సంబంధించి అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్‌ తమతో పరోక్ష చర్చలకు సిద్ధపడొచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.


Also Read: ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్యం కథ ముగిసింది: తాలిబాన్లు

ఈ నెల మొదట్లో కూడా ఇరాన్‌కు రాసిన లేఖ గురించి ట్రంప్ పేర్కొన్నారు. ‘‘వాళ్లు నా నుంచి లేఖను కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇది కాదంటే మరో ప్రత్యామ్నాయాన్ని ప్రయత్నించాల్సి ఉంటుంది. మరో అణ్వాయుధాన్ని అంగీకరించలేము కదా’’ అని విలేకరులతో ఆయన వ్యాఖ్యానించారు.

2018లో ఇరాన్‌కు, ప్రపంచదేశాలకు మధ్య జరుగుతున్న చర్చల నుంచి ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం వైదొలగింది. నాటి చర్చల ప్రకారం, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కట్టపెడితే ఆర్థిక ఆంక్షల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, చర్చలు విఫలం కావడంతో అప్పట్లో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇక తాజా వార్నింగ్‌లో ట్రంప్.. రెండో ఆర్థిక ఆంక్షలు కూడా ఉంటాయని ఇరాన్‌ను గట్టిగా హెచ్చరించారు.


Also Read: 500 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష

2018 నుంచి ఇరాన్, అమెరికాల మధ్య అగాధం పెరిగింది. ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న వర్గాలపై కూడా దాడులు జరిగాయి. ప్రస్తుతం యెమన్‌లోని హౌతీలపై అమెరికా వైమానికదాడులు నిర్వహిస్తోంది. ఇరాన్‌పై మిలిటరీ చర్యల విషయంలో మాత్రం ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read Latest and International News

Updated Date - Mar 30 , 2025 | 10:06 PM