Share News

ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:14 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధివిధానాలను మా నుకోవాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్‌ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధివిధానాలను మా నుకోవాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్‌ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. బీఎంఎస్‌ కేంద్ర కమి టీ పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర బడ్జెట్‌లో సవరణలు చేయాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి ఏవో రాంరెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షు డు శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీడి కార్మికు లకు ఇస్తామన్న రూ.4వేల జీవనభృతి అమలు చేయాల న్నారు. బీడి కార్మికుల ఈపీఎఫ్‌ పెన్షన్‌ను ఐదువేలకు పెంచి 50 శాతం రిలీప్‌పెన్షన్‌పెంచాలన్నారు. ఈనెల 29న సిరిసిల్లలె రాష్ట్ర బీడికార్మిక సంఘం అధ్వర్యంలో నిర్వహిం చే రాష్ట్ర మహాసభలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీఎంఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు సుధీర్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌, బీడికార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిలివేరి కృష్ణయ్య, మహి ళా కార్యకర్తలు మంజుల, కీర్తి పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 01:14 AM