సాగునీరు అందించే వరకు పోరాటం..
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:16 AM
ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీ టి ని అందించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ పోరా టం ఆగదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

వీర్నపల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీ టి ని అందించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ పోరా టం ఆగదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. వీ ర్నపల్లి మండలం మ ద్దిమల్ల రాయిని చెరువు 9వ ప్యాకేజీ పెండింగ్ పనులను ప్రభుత్వం పూర్తిచేసి మండలంలోని చెరువులను నింపాలని నాప్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, రైతులతో కలిసి రాయిని చెరువు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు బుధవారం పాదయాత్ర చేపట్టారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో విన తిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు గుగులోతు కళ, సెస్ డైరెక్టర్ మాడు గుల మల్లేశం, బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, నాయకులు, రైతులు పాల్గొన్నారు.