సీఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలి
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:12 AM
సీఎంఆర్ లక్ష్యం ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చే యాలని అదనపు కలె క్టర్ ఖీమ్యానాయక్ ఆదే శించారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : సీఎంఆర్ లక్ష్యం ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చే యాలని అదనపు కలె క్టర్ ఖీమ్యానాయక్ ఆదే శించారు. ఖరీఫ్, రబీ సీజన్ రైస్ అప్పగింత, బ్యాంక్ గ్యారంటీ అంశా లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో జిల్లాలోని రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహిం చారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు రబీ సీజన్ 2023 - 24 లో దిగుమతి చేసుకున్న ధాన్యం 256343 టన్నులు , మొత్తం బియ్యం 174313 ఇవ్వాల్సి ఉండగా, 143656 టన్నులు ఇచ్చారు. అలాగే ఖరీఫ్ 2024 - 25 దిగుమతి చేసుకున్న ధాన్యం 211572 మొత్తం బియ్యం 142150 ఇవ్వాల్సి ఉండగా ఇప్పటిదాకా 21103 ప్రభుత్వానికి అందజేశారు. ఆయా రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు త్వరితగతిన అందజేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. రైస్ మిల్లులకు రోజు వారీ లక్ష్యాలు నిర్ణయించి, వాటిపై సమీక్షించాలని పేర్కొన్నారు. పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ రైస్‌మిల్లు లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయో గుర్తించాలని, నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. వారు సీఎంఆర్ ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకోవాలని, సరైన ప్రణాళిక రూపొందించి లక్ష్యం చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లక్ష్యం పూర్తి చేయడంలో రైస్ మిల్లర్లకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మీ, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.