మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు ఉండొద్దు..
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:09 AM
రాజన్న సిరి సిల్ల జిల్లాలోని అన్ని మున్సిపా లిటీలు, గ్రామాల్లో మిషన్ భగీ రథ నీరు సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకో వాలని కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా సంబందిత ఉద్యోగు లను ఆదేశించారు.

వేములవాడ టౌన్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరి సిల్ల జిల్లాలోని అన్ని మున్సిపా లిటీలు, గ్రామాల్లో మిషన్ భగీ రథ నీరు సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకో వాలని కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా సంబందిత ఉద్యోగు లను ఆదేశించారు. వేములవా డ మండలం అగ్రహారం సమీ పంలోని మిషన్ భగీరథ ఫిల్ట ర్‌బెడ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, నీటి ఽశుద్దా, సరఫరా, ల్యాబ్‌లను బుధవా రం పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్‌కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజి వంటి వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ప్రతి ఇంటికి నల్లనీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజూ రెండు సార్లు జిల్లాలోని ఓహెచ్‌ఎస్‌ఆర్‌లను మిషన్ భగీరథ గ్రిడ్ ఇంజనీర్ నింపాలని అన్నారు. నీటి నాణ్యతను ప్రతి రోజు నాలుగు సార్లు పరిశీలిం చాలని సూచించారు. జిల్లాలో ఏఏ గ్రామాలకు త్రాగునీరు వెళ్లడం లేదు పూర్తిగా తెలుసుకోవా లని సూచించారు. త్రాగు నీరు వెళ్లని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు వెళ్లేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆయన వెంట మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ కార్యనిర్వహక ఇంజనీరులు జానకి, శేఖర్‌రెడ్డి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు ఉన్నారు.