Share News

Donald Trump: ఈ దేశాలకు షాకిచ్చిన ట్రంప్.. భారీగా సుంకాలు విధింపు..

ABN , Publish Date - Feb 02 , 2025 | 07:35 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కెనడా, మెక్సికో, చైనా నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధించనున్నట్లు శనివారం ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Donald Trump: ఈ దేశాలకు షాకిచ్చిన ట్రంప్.. భారీగా సుంకాలు విధింపు..
Donald Trump

అమెరికా (america) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకాలు విధించాలని ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని అక్రమ వలసదారులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వల్ల కలిగే ముప్పు నుంచి అమెరికా పౌరులను రక్షించడానికి తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇవి ఉత్తర అమెరికాలో ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.


వలసలను అరికట్టడం

ట్రంప్ తన అధికారిక సంతకం చేసిన ఉత్తర్వులో పేర్కొంటూ "అమెరికా పౌరులను రక్షించడం నా కర్తవ్యం. ఎందుకంటే అక్రమ వలసదారులు, ఫెంటానిల్ వంటి ప్రాణాంతక మాదకద్రవ్యాల ప్రభావం మన దేశాన్ని దెబ్బతీస్తోంది. ఈ చర్యలు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద తీసుకోబడినవని ట్రంప్ అన్నారు. ఇందులో కెనడా నుంచి ఇంధన దిగుమతులపై 10 శాతం తగ్గిన రేటుతో పన్ను విధించబడింది. మెక్సికో, కెనడా, చైనాకు విధించే ఈ సుంకాలు కీలకమైన వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేయవచ్చని వైట్ హౌస్ తెలిపింది. ఈ క్రమంలో ముఖ్యంగా అక్రమ వలసలను అరికట్టడం, మాదకద్రవ్యాల రవాణాను తగిన విధంగా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.


కెనడా ప్రధాని రియాక్షన్..

ఈ నిర్ణయం మెక్సికో, కెనడా మధ్య వాణిజ్య సంబంధాలను పెద్దగా దెబ్బతీయవచ్చు. వీటికి ప్రతిస్పందనగా ఆ రెండు దేశాలు కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల వచ్చే సుంకాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసి, ద్రవ్యోల్బణం, కొన్నిచోట్ల ధరల పెరుగుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగించే అవకాశం ఉంది. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ సుంకాలకు ప్రతిస్పందిస్తూ, "మన సరిహద్దులపై ఈ సుంకాలు విధిస్తే, మేము సహేతుకంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారు. "అయితే, ఇది కెనడా-యుఎస్ సంబంధాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది" అని ట్రూడో వ్యాఖ్యానించారు.


చైనా విషయంలో మాత్రం..

అలాగ ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారంలో చైనాపై 60 శాతం వరకు సుంకాలు విధిస్తానని చెప్పినప్పటికీ, అధికారంలోకి వచ్చాక ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా ఈ సమస్యను అధ్యయనం చేయమని ఆదేశించారు. ఈ కొత్త సుంకాల విధింపుతో కెనడా, మెక్సికో, చైనా వాణిజ్య రంగంలో ఒక పెద్ద ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలకు ప్రభావితం కానుంది.


ఇవి కూడా చదవండి:

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..

Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..

Read More International News and Latest Telugu News

Updated Date - Feb 02 , 2025 | 07:37 AM

News Hub