Share News

Trump Golden Card: గోల్డెన్‌ ట్రంప్‌ కార్డ్‌ ఇదే

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:54 AM

డొనాల్డ్ ట్రంప్, అమెరికా పౌరసత్వం పొందేందుకు 5 మిలియన్ డాలర్లతో "గోల్డ్ కార్డ్"ను ప్రవేశపెట్టారు. ఈ కార్డ్‌పై ట్రంప్ యొక్క మగ్ షాట్ చిత్రంతో పాటు, "ది ట్రంప్ కార్డ్" అనే క్యాప్షన్ ఉంది

Trump Golden Card: గోల్డెన్‌ ట్రంప్‌ కార్డ్‌ ఇదే

వాషింగ్టన్‌: ఎలాంటి నిబంధనల జంఝాటాలు లేకుండా నేరుగా అమెరికా పౌరసత్వం పొందడానికి వీలుకల్పించే ‘గోల్డ్‌ కార్డ్‌‘ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. గురువారం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో దీనిని విడుదల చేశారు. ‘‘ఐదు మిలియన్‌ డాలర్లు చెల్లిస్తే ఇది మీదే.. ఇదే మొదటి కార్డ్‌.. ఇదేమిటో తెలుసా..? ఇది గోల్డ్‌ కార్డ్‌.. ది ట్రంప్‌ కార్డ్‌’’ అంటూ వీసా గోల్డ్‌ కార్డ్‌ను చూపించారు. మొదటి కార్డును తానే కొనుగోలు చేశానని చెప్పారు. బంగారు రంగులో ఉన్న ఈ కార్డ్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ ‘మగ్‌షాట్‌’ చిత్రం ఉండటం గమనార్హం. నేరస్తులకు సంబంధించి పోలీసులు/జైలు అధికారులు తీసే చిత్రాలే ‘మగ్‌ షాట్‌లు’. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్‌ ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసు నేపథ్యంలో ఆయన అట్లాంటాలోని ఫుల్టన్‌ కౌంటీ జైలులో లొంగిపోయారు. ఆ సమయంలో జైలు అధికారులు ట్రంప్‌ మగ్‌షాట్స్‌ తీశారు. అందులో ఆయన ముఖం నేరుగా కనిపించేలా ఉన్న చిత్రం వైరల్‌గా మారింది. ఇప్పుడు గోల్డ్‌కార్డ్‌పై దాన్ని ముద్రించడం విశేషం. ఇక కార్డ్‌పై ఆయన వెనకాల స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ చిత్రంతోపాటు ‘ది ట్రంప్‌ కార్డ్‌’ అని క్యాప్షన్‌ పెట్టారు. అంతేకాదు.. దీని విలువ 5 మిలియన్‌ డాలర్లు అన్నదీ చాలా స్పష్టంగా కనిపించేలా ముద్రించారు.


అమెరికాలో నివసించాలనుకునే ఇతర దేశాల సంపన్నులను ఆకర్షించేందుకు ‘గోల్డ్‌ కార్డ్‌’ వీసాను ప్రవేశపెడుతున్నట్టు ట్రంప్‌ గతంలోనే ప్రకటించారు. దీనికోసం 5 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.42.7 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సమకూరే నిధులతో అమెరికా అప్పులను కూడా తీర్చేయవచ్చని కూడా ట్రంప్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Vijaya Dairy Price Revision: పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ డెయిరీ..

బంగారం తనఖా పెట్టి అప్పు తీసుకుంటే.. ఇవి తప్పక తెలుసుకోండి..

YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయుల కన్నా ఆస్తులే ఎక్కువ: వైఎస్ షర్మిలా రెడ్డి

Updated Date - Apr 05 , 2025 | 03:54 AM