Israeli Strikes: ఆగని మారణకాండ.. గాజాలో 32 మంది బలి
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:35 PM
Israeli Strikes: గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా బాంబు దాడులు జరిగాయి. ఈ దాడిలో 32 మంది చనిపోయారు. వీరిలో 12 మందికిపైగా మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

గాజాపై ఇజ్రాయెల్ మారణకాండ కొనసాగుతోంది. గాజాలో నిత్యం పదుల సంఖ్యలో ప్రాణాలు లేస్తున్నాయి. ఆదివారం కూడా ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగాయి. గాజాపై జరిగిన విమాన దాడుల్లో 32 మంది చనిపోయారు. వీరిలో 12 మందికి పైగా మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ దాడులు జరగటం గమనార్హం. అమెరికా వెళ్లిన నెతన్యాహు.. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్దం గురించి,
దాడులు నిలిపివేయటం గురించి మాట్లాడనున్నారు. ఇక, గాజాలోని బజాలియా రెఫ్యూజీ క్యాంప్ దగ్గర కూడా బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు చనిపోయారు. అయితే, గాజా హెల్త్ మినస్ట్రీ చెబుతున్న దాని ప్రకారం.. మొత్తం ఏడుగురి శవాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఓ చిన్న పిల్లాడితో పాటు ఓ మహిళ కూడా ఉంది. అంతేకాదు.. గాజా సిటీలోని బేకరీ దగ్గర నిల్చుని ఉన్న వారిపై కూడా బాంబులు పడ్డాయి. దీంతో 6 మంది అక్కడికక్కడే చనిపోయారు.
యుద్ధం అలా మొదలైంది
2023, అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు. 1200 మందిని చంపేశారు. 251 మందిని బందీలుగా మార్చారు. దీంతో యుద్దం మొదలైంది. 59 మంది బంధీలు ఇంకా గాజాలోనే ఉన్నారు. హమాస్ చేసిన పనికి ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. బాంబు దాడులకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 50 వేలకు పైగా పాలస్తీనియన్లను చంపేసింది. కానీ, ఇజ్రాయెల్ మాత్రం తాము 20 వేల మందినే చంపామంటోంది.
ఇవి కూడా చదవండి:
Viral News: వరుడి చెప్పులు దాచి రూ.50 వేలు డిమాండ్..చివరకు దాడి, ఇది కరెక్టేనా..
Road Accident: రోడ్డు ప్రమాదం..డిప్యూటీ కలెక్టర్ మృతి