Share News

DMK Moves SC: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్

ABN , Publish Date - Apr 07 , 2025 | 07:37 PM

వక్ఫ్ సవరణ చట్టం తమిళనాడులోని 50 లక్షల మంది ముస్లింలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని 20 కోట్ల మంది ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని డీఎంకే ఎంపీ ఎ.రాజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

DMK Moves SC: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం 2025 (Waqf Amendment Act)పై సుప్రీంకోర్టు (Supreme Court)లో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ డీఎంకే (DMK) సైతం ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ.రాజా (A Raja) ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. లోక్‌సభ ఎంపీ అయిన ఎ.రాజా.. వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ మాజీ సభ్యుడిగా కూడా ఉన్నారు. వక్ఫ్ సవరణ చట్టం తమిళనాడులోని 50 లక్షల మంది ముస్లింలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని 20 కోట్ల మంది ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.

Badlapur Encounter: బద్లాపూర్ ఎన్‌కౌంటర్ కేసులో మంబై హైకోర్టు సంచలన తీర్పు


సుప్రీంకు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు

వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ పలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు వేశాయి. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ ఏప్రిల్ 4న పిటిషన్ వేశారు. ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘింస్తోందని ఆయన తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అదే రోజు ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీ్న్ ఒవైసీ కూడా వక్ఫ్ సవరణ బిల్లు 2025ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ గత శనివారంనాడు సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లును సవాలు చేశారు.


వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

కాగా, పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 5న ఆమోదముద్ర వేశారు. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. లోక్‌సభలో 288 మంది సభ్యులు అనూకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉభయసభల్లోనూ బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో బిల్లు చట్టరూపం సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి..

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 07:38 PM