Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
ABN , Publish Date - Apr 07 , 2025 | 06:42 PM
Rains: వేసవి కాలం.. అసలే ఎండలు మండిపోతున్నాయి. అలాంటి వేళ.. ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులు వీచడంతోపాటు వర్షం పడడంతో.. రైతులు తీవ్ర ఆందోళన చెందారు.

విజయవాడ, ఏప్రిల్ 07: వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. అలాంటి వేళ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెడ్డిగూడెం, మైలవరం, తిరువూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఈదురు గాలులు వీచాయి. వీటికి తోడు భారీ వర్షం కురిసింది. దీంతో ఆ యా ప్రాంతాల్లోని మామిడి తోటల్లోని కాయలు నెల రాలిపోయాయి. దీంతో మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలో మామిడి రైతులతోపాటు వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో సైతం ఈదురు గాలులు వీచడంతో.. థర్మల్ కేంద్రంలో బూడిద ఆ యా ప్రాంతాల్లో ఎగిసిపడింది. దీంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ ఈ బూడిదతో నిండిపోయాయి.
మరోవైపు రాబోయే మూడు గంటల్లో ఏలూరు,ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సోమవారం వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో చెట్లు కింద నిలబడ వద్దని ప్రజలకు ఆయన సూచించారు. అలాగే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..
For AndhraPradesh News And Telugu News