Garlic Benefits: వెల్లుల్లి తొక్క తీసి వాడాలా.. తీయకుండా వాడాలా..
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:03 PM
Myths and Facts About Garlic: అనేక వంటకాల్లో వెల్లుల్లి ప్రధానమైనది. దీని వల్ల ఆహార పదార్థాలు మరింత రుచికరంగా ఉంటాయి. కానీ, వెల్లుల్లి వాడే విషయంలో ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నాయి. అందరూ నమ్మే ఈ 6 విషయాలు నిజమా.. అబద్ధమా.. ఇక్కడ తెలుసుకోండి.

Myths and Facts About Garlic Uses: మనం తినకుండా ఉండలేని పదార్థాలలో వెల్లుల్లి ఒకటి. వీటిని కూరలు, పచ్చళ్లు, పోపు, వేపుళ్లు, చట్నీలు, ఊరగాయలు ఇలా చాలా రకాల ఆహార పదార్థాల్లో తప్పనిసరిగా వాడతారు. వెల్లుల్లి వల్ల ఆయుర్వేపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఎవరికైనా జలుబు లేదా ఫ్లూ ఉంటే మన బామ్మలు లేదా అమ్మమ్మలు వెల్లుల్లితో తయారుచేసిన పదార్థాలు ఇస్తుంటారు. అయితే, వెల్లుల్లి వాడకం గురించి ప్రజల్లో అనేక రకాల అపోహలు ఉన్నాయి. చాలా మంది నిజమని నమ్మే ఈ 6 విషయాలు కేవలం అపోహే అని తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపడకుండా ఉండలేరు.
1. ఉడికించిన వెల్లుల్లి Vs పచ్చి వెల్లుల్లి
ఉడికించిన వెల్లుల్లి మంచిదా లేదా పచ్చి వెల్లుల్లి మంచిదా అని సందేహపడుతున్నారా. ఆరోగ్య నిపుణుల ప్రకారం కచ్చితంగా పచ్చి వెల్లుల్లే మంచిది. ఇందులో అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగని దీనర్థం ఉడికించిన వెల్లుల్లి పనికిరానిది అని కాదు. మీరు వెల్లుల్లిని వేయించినప్పుడు లేదా ఉడికించినపుడు కొద్ది శాతం అల్లిసిన్‌ను తగ్గవచ్చు. కానీ వంటలో వాడే ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వెల్లుల్లి మరింత ప్రయోజనకరమైన ఆహారంగా మారుతుంది. అంతేకాకుండా, ఉడికించిన వెల్లుల్లి సులభంగా జీర్ణం అవుతుంది. చాలా రుచికరంగా కూడా ఉంటుంది.
2. వెల్లుల్లి ఏ ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది
వెల్లుల్లి ఆరోగ్యకరమైనది అనడంలో సందేహం లేదు. దీనికి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, గుండెకు మద్దతు ఇచ్చే లక్షణాలు ఉన్నాయి. కానీ వెల్లుల్లి మాత్రమే మీ ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందని అనుకోవడం ఒక అపోహ. పచ్చి వెల్లుల్లిని నమలడం వల్ల తక్షణమే విషం బయటకు వెళ్లిపోతుంది అని కొందరంటే అది భ్రమే. దీర్ఘకాలిక సమస్యలు రాత్రికి రాత్రే నయమవుతాయని చెప్పినా నమ్మకండి.
3. వెల్లుల్లిని ఎక్కువగా వాడొచ్చా
వెల్లుల్లిని ఎక్కువగా వాడటం మంచిది కాదని కొందరు అంటుంటారు. సాధారణం కంటే ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు అదనంగా జోడిస్తే ఏదో అయిపోతుందని భావిస్తుంటారు. కానీ, ఎక్కువ వెల్లుల్లిని వాడితే వంటకం చేదుగా మారుతుంది లేదా వంటకంలోని ఇతర రుచులను మింగేస్తుంది. అంతే తప్ప వెల్లుల్లిని ఎక్కువ తినడం నేరం కాదు. తగినంత మొత్తంలో వెల్లుల్లిని ఆహారపదార్థాల్లో వేసుకుంటే చక్కని రుచి వస్తుంది.
4. వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెట్టవచ్చా
వెల్లుల్లి చెడిపోయిందని ఎలా గుర్తించాలో చాలామందికి తెలియదు. ఇది మెత్తగా మారినా , ఆకుపచ్చ మొలకలు లేదా పుల్లని వాసన వచ్చినా కుళ్లిపోయిందన, వాడుకోవడానికి పనికిరాదని అర్థం. మొలకెత్తిన వెల్లుల్లిని తినవచ్చుగానీ అది చేదుగా ఉండవచ్చు. ఇక వెల్లుల్లిని తాజాగా ఉంచడానికి మంచి గాలి ప్రవాహం ఉన్న చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. దుర్వాసనలు రాకుండా ఉంటుందని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచవద్దు.
5. వెల్లుల్లి తింటే దోమలు పారిపోతాయా
వెల్లుల్లిని తినడం వల్ల దోమలు దూరంగా ఉంటాయని చెప్పేందుకు ఖచ్చితమైన రుజువులేవీ లేవు. కాకపోతే వీటిని తిన్నాక మీ చర్మం ద్వారా వెలువడే బలమైన వాసన కీటకాలను దూరంగా ఉంచే మాట మాత్రం వాస్తవం. కానీ ఈ నమ్మకానికి సైన్స్ పరంగా నిరూపణ లేదు. నిజానికి దోమలను తరిమికొట్టేందుకు యూకలిప్టస్ అద్భుతంగా పనిచేస్తుంది.
6.తొక్క తీయకుండా వాడకూడదా
వంట చేసే ముందు ఎల్లప్పుడూ వెల్లుల్లి తొక్క తీయాలి అంటారు. ఇదేం తప్పనిసరిగా కాదు. ప్రతి వంటకానికీ వెల్లుల్లి తొక్క తీయాల్సిన పనిలేదు. మీరు వెల్లుల్లిని తొక్కతో కలిపి వేయించినప్పుడు అది మృదువుగా మారి తీపి రుచిని ఇస్తుంది. భారతీయ వంటకాల్లో చాలామంది ప్రత్యేక రుచి కోసం తొక్కతీయకుండా వెల్లుల్లిని వేస్తుంటారు.
Read Also: Black Vs Red Clay Pot: నల్ల కుండ Vs ఎరుపు కుండ.. ఏ కుండలో నీళ్లు మంచివి..
Real Ghee vs Fake Ghee: స్వచ్ఛమైన నెయ్యికి, కల్తీ నెయ్యికి తేడాలేంటి.. గుర్తించడమెలా..
Beauty Tips: వేసవిలో ముఖం మెరవాలంటే.. ఇంట్లోనే ఈ ఫేషియల్ ట్రై చేయండి..