Share News

చాణక్య నీతి.. వీళ్ల జోలికి అస్సలు పోకూడదు.. నాశనం అయిపోతారు..

ABN , Publish Date - Mar 30 , 2025 | 06:04 PM

ఆచార్య చాణక్యుడి చెప్పిన దాని ప్రకారం కొంతమందిని అవమానించటం.. వారిని తక్కువ చేసి చూడటం వల్ల మన జీవితంపై చెడు ప్రభావం పడుతుందట. కొన్ని సార్లు మన జీవితమే నాశనం అయ్యే అవకాశం ఉందని చాణక్యుడు అన్నాడు.

చాణక్య నీతి.. వీళ్ల జోలికి అస్సలు పోకూడదు.. నాశనం అయిపోతారు..
Chanakya Neeti

మనిషి ఎలా జీవించాలో.. ఎలా జీవించకూడదో.. ఎవరితో ఎలా ఉండాలో.. ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో.. ఇలా ఒక్కటేమిటి.. మనుషుల జీవితాన్ని సన్మార్గంలో పెట్టే చాలా గొప్ప గొప్ప విషయాలు ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు. ఆయన చెప్పి కొన్ని వందల ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికి కూడా ఆ నీతులు ఎంతో అద్భుతంగా పని చేస్తున్నాయి. చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం కొంతమందిని తక్కువ చేసి చూడటం.. వారిని అవమానించటం వల్ల మన జీవితమే నాశనం అవుతుందట. వారి జోలికి పోకుండా ఉంటేనే మంచిదని ఆయన నొక్కి వక్కానించి మరీ చెప్పాడు.


ఆడవాళ్లు

ఈ సృష్టికి మూలం ఆడవాళ్లు. అలాంటి ఆడవాళ్లను అవమానించటం కానీ, అవసరాల కోసం మోసం చేయటం కానీ చేయకూడదు. ఆడవాళ్లను మోసం చేసే వాళ్ల కుటుంబం పేదరికంలో కూరుకుపోతుందట. లక్ష్మీ దేవి వారి దగ్గర అస్సలు ఉండదట. జీవితంలో సుఖ,సంతోషాలతో బాగా ఉండాలంటే ఆడవాళ్లను గౌరవించాలని చాణిక్యుడు చెబుతున్నాడు.

గురువు

త్రిమూర్తులకు ప్రతీరూపంగా గురువును భావిస్తాము. అలాంటి గురువును అస్సలు తక్కువ చేసి చూడకూడదట. ఆయన్ను అవమానించకూడదట. అలా చేస్తే లక్ష్మీ దేవికి మనపై కోపం వస్తుందట. గురువుల్ని అవమానించే వారితో లక్ష్మి ఉండదట.


పనివాళ్లు

నూటికి తొంభై శాతం మంది.. పని వాళ్లను చాలా చీప్‌గా చూస్తూ ఉంటారు. వారికి అస్సలు మర్యాద ఇవ్వరు. ఇంట్లో వాళ్లందరూ తిన్న తర్వాత వాళ్లు తినాల్సివస్తుంది. కొన్ని సార్లు తినడానికి ఏమీ దొరకని పరిస్థితి కూడా ఉంటుంది. ఇలా పని వాళ్లను తక్కువ చేసి చూస్తూ హింసించటం వల్ల కూడా లక్ష్మీ దేవి ఇంట్లో ఉండదట.

వృద్ధులు, రోగులు

ముసలివాళ్లను, రోగులను కూడా అవమానించకూడదట. బలహీనంగా ఉన్నారు కదా అని వారితో తాగాదాలు పెట్టుకోకూడదట. అలాంటి వారితో చెడుగా ప్రవర్తిస్తే అది మన జీవితంపైనే ప్రభావం చూపుతుందట.


ఇవి కూడా చదవండి:

షేక్ చేసిన జాన్వీ

మరణం గుట్టు విప్పిన డాక్టర్.. చనిపోయిన వాళ్లను బతికించొచ్చట.

పాపం.. యువతి విచిత్ర జీవితం.. టాయిలెట్‌‌లొ అద్దెకు..

Updated Date - Mar 30 , 2025 | 06:04 PM