Rain Alert: కాసేపట్లో మళ్ళీ భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల వారికి బిగ్ అల్టర్
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:41 PM
Rain Alert: కాలం కానీ కాలంలో వర్షాలు తెలంగాణ ప్రజలను ముంచెత్తుతోన్నాయి. గురువారం హైదరాబాద్ మహానగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అనంతరం భారీ వర్షం కురిసింది. దీంతో నగరలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి.

హైదరాబాద్, ఏప్రిల్ 04: తెలంగాణలో అకాల వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం.. అంటే ఈ రోజు ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. రానున్న 2 గంటల్లో తూర్పు, దక్షిణ తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక హైదరాబాద్ మహా నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏప్రిల్ 03వ తేదీన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షంతో మహానగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దీంతో నగర జీవులు ఆఫీస్ ముగించికొని ఇంటికి వెళ్లే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు నగరంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు వేసవి కాలం రావడంతో.. ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. వాతావరణంలో తేమ శాతం కనిష్టానికి తగ్గిపోయిందని వాతావరణ శాఖ వారు వివరించారు. దీంతో ఓ వైపు ఎండలు, మరోవైపు ఉక్క పోతతో నగర జీవి ఓ విధమైన అసౌకర్యానికి గురయ్యాడు.
అలాంటి వేళ.. ఒక్క సారిగా వాతావరణం మారడం.. దీనికి తోడు భారీగా వర్షం పడడంతో నగర ప్రజలు ఒకింత సాంత్వన చేకూరింది. అయితే ఈ వర్షాలు కురవడం..ఆగిన ఆనంతరం మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడనే ఓ విధమైన ఆందోళన నగర జీవుల మదిలో మెదులుతోంది. ఇక వర్షాలు కురిస్తే.. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం సూచించారు. ఆ క్రమంలో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని వారిని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
LSG vs MI Prediction: పంత్ వర్సెస్ పాండ్యా.. లెక్క సరిచేస్తారా..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్