Summer Tips: స్టైలిష్ లుక్ కోసం వేసవిలోనూ బూట్లు ధరిస్తున్నారా.. ఇలా చేస్తే పాదాలు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 07:39 PM
Shoes in Summer: వేసవి కాలంలో సాధారణ సమయాలతో పోల్చితే ఎండ వేడి ఎక్కువ. సూర్యకిరణాల తీవ్రత అధికంగా ఉండటం వల్ల వాతావరణంలో వేడి పెరిగి చెమటలు పట్టడం సర్వసాధారణం. ఇది పరిమితికి మించితే వడదెబ్బకు గురయ్యే అవకాశం పెరుగుతుంది. అందుకే ఎండాకాలంలో ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, చర్మసంరక్షణ ఇలా ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే పాదాలపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించడం అవసరం. ముఖ్యంగా బూట్లు ధరించే విషయంలో..

Shoes in Summer: బూట్లు పాదాలను సంరక్షించే మాట నిజమే. నడక, రన్నింగ్ కు అనుకూలంగా ఉంటాయి. అదీగాక మార్కెట్లో దొరికే రంగురంగుల, ఆకర్షణీయమైన బూట్లు యువతను అమితంగా ఆకర్షిస్తాయి. వీటిని ధరిస్తే కంఫర్టబుల్‌గా, స్టైలిష్‌గా ఉంటామని భావిస్తారు. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా బూట్లు ఇట్టే మ్యాచ్ అయిపోవడమూ మరో కారణం. చలికాలంలో పాదాలను వెచ్చగా ఉంచి పగుళ్లు రాకుండా చేసే బూట్లు.. ఎండాకాలంలోనూ అలాగే పనిచేస్తాయి అనుకుంటే పొరపాటు. వేసవిలో రోజంతా బూట్లు ధరించి తిరిగితే సున్నితమైన పాదాలు దెబ్బతింటాయి. ఎందుకు? ఎలాంటి సమస్యలు వస్తాయి? అని షూ ధరించడానికి ఇష్టపడేవారు తప్పక తెలుసుకోవాలి.
వేసవిలో షూ ఎందుకు వేసుకోవద్దు..
ఎండాకాలంలో వేడికి శరీరం మొత్తం చెమటతో తడిసిపోతుంది. ముఖ్యంగా అరచేతులు, పాదాల్లో ఎక్కువగా స్వేదం నిరంతరం కారిపోతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు పాదాలు గాలికి ఆరనిచ్చేలా చెప్పులు ధరించాలి. లేకపోతే
చెమట మొత్తం షూలోకి వెళ్లి విపరీతమైన దుర్వాసన వేస్తుంది. పాదాలకు బిగుతుగా అతుక్కుని ఉండటమే దీనికి కారణం.
వేసవిలో వీలైనంతవరకూ బిగుతుగా లేని తేలికైన పాదరక్షలు ధరించడం మంచిది. లేకపోతే పాదాల్లో వాపులు, నొప్పి, రక్తప్రసరణ సమస్యలు వస్తాయి.
రోజంతా సాక్స్‌లను ధరించి, ఆపై బూట్లు ధరించి ఈ సీజన్లో తిరిగితే ఉక్కపోత, విపరీతమైన వేడికి చెమట సమస్య ఎక్కువవుతుంది. గాలి ప్రసరణ లేక పాదాలు ఉబ్బి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఇలాంటి సమస్యలను నివారించడానికి తేలికగా, గాలి తగిలేలా ఉండే చెప్పులు ధరించడం ఉత్తమం.
సాధారణ సమయాల్లో అయినా బూట్లు ధరించినప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సాక్సులు ఏ రోజుకారోజు ఉతికినవే ధరించాలి. సరిగ్గా శుభ్రపరచుకోకపోయినా పాదాలకు చర్మవ్యాధులు రావచ్చు. సాక్స్ కూడా మెత్తని కాటన్ తో తయారుచేసిన వాటినే ఎంచుకోవాలి. నైలాన్ లేదా పాలిస్టర్ సాక్స్‌లు ధరించడం మానేయండి.
Read Also: Ice Creams: ఎండాకాలంలో ఐస్‌క్రీమ్స్ తినడం సురక్షితమేనా..
Kitchen Hacks: మీరు కొంటున్న కందిపప్పు నిజమైనదా లేదా నకిలీదా.. తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలు..