Share News

Weight Loss: రెండున్నరేళ్లలో 150 నుంచి 75 కేజీలకు

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:34 PM

కేవలం రెండున్నరేళ్లలో 150 కేజీల నుంచి 75 కేజీలకు బరువు తగ్గి సిక్స్ ప్యాక్ బాడీ తెచ్చుకున్నాడు నమన్ చౌదరి. దీని వెనుక ఉన్న సీక్రెట్ అందరితో పంచుకున్నాడు

Weight Loss:  రెండున్నరేళ్లలో 150 నుంచి 75 కేజీలకు
Weight Loss

సాధన చేస్తే సాధ్యం కానిదేదీ లేదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా. అయితే, నిజజీవితంలో క్రమశిక్షణ, అంకితభావంతో మెలిగి లక్ష్యాలను అందుకుంటున్న వాళ్లు చాలా తక్కువ. కాని, నమన్ చౌదరి అనే రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన యువకుడు ఎదుర్కొన్న అవమానాలన్నింటినీ దిగమింగి అందరికీ ఆదర్శంగా నిలిచేలా తను అనుకున్నది సాధించి తానేంటో నిరూపించాడు.


బరువు తగ్గడానికి ఈ రోజుల్లో ఎన్ని కుస్తీలు పట్టినా టార్గెట్ రీచ్ కావడం లేదు చాలా మంది. అయితే, నమన్ కేవలం రెండున్నరేళ్లలో 150 కేజీల నుంచి ఏకంగా 75 కిలోలు తగ్గాడు. తన సోషల్ మీడియా ఖాతాలో తన డైట్ ప్లాన్‌ను పంచుకున్నాడు. అంతేకాదు, దీని గురించి ఆ యంగ్ మ్యాన్ ఏం రాశాడంటే.. "ఇది బరువు తగ్గడం గురించి మాత్రమే కాదు. ఇది బలం, విశ్వాసం, సెల్ఫ్ లవ్‌కి సంబంధించింది" అన్నాడు. సాక్ష్యంగా తను ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఫొటోలు, తను ఒకప్పుడెలా ఉండేవాడు.. ఇప్పుడెలా ఉన్నాడన్న పిక్స్ ఉంచుతూ పోస్ట్ చేశాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో నమన చౌదరి ఇప్పుడు వైరల్ అవుతున్నాడు.


2021లో నమన్ 150 కిలోల బరువు ఉండేవాడు. ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాడు. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలన్న తపనతో ఆ దిశగా అడుగులు వేశాడు. క్రమం తప్పకుండా వ్యాయామం, టెంప్ట్ అవ్వకుండా తగిన ఫుడ్ ఫ్లాన్ చేసుకుని ఆచరించాడు. బరువులు ఎత్తాడు, ప్రోటీన్ అధికంగా ఉండే ఇంట్లో వండిన ఆహారంతో క్లీన్ డైట్‌ తీసుకున్నాడు. అంతే, కేవలం రెండున్నర సంవత్సరాలలో 75 కిలోలకు చేరుకున్నాడు. తను ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకున్నాడో కూడా పూర్తిగా వివరించాడు.


ఈ వార్తలు కూడా చదవండి

Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ

BJP: ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే..

CM Revanth Reddy: సర్వాయి పాపన్నకు సీఎం రేవంత్‌ నివాళి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Apr 03 , 2025 | 12:41 PM