Coll Water: ఎండాకాలం ఐస్ వాటర్ తాగుతున్నారా.. ఊహించని సమస్యలు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 09:50 AM
ఎండాకాలం వచ్చిందంటే చల్లని నీళ్ల కోసం అందరూ ఆరాటపడతారు. ఎండలో గొంతు ఎండిపోతే ఒక గ్లాస్ కూల్ వాటర్ తాగితే ప్రాణం లేచి వస్తుంది. చాలామంది ఫ్రిజ్‌లో బాటిల్స్ పెట్టి నీళ్లు చల్లగా తాగుతారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ABN Internet: వేసవికాలంలో (Summer) ఐస్ వాటర్ (Ice Water) తాగడం గురించి చాలా మందిలో సందేహాలు ఉంటాయి. ఈ క్రమంలో ఐస్ వాటర్ అసలు తాగొచ్చా.. తాగితే రోజుకు ఎంత మొత్తంలో తాగాలనే సందేహం చాలామందిలో కలుగుతుంది. వేసవిలో శరీరానికి హైడ్రేషన్ (Hydration) చాలా ముఖ్యం. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ద్వారా నీరు, లవణాలు బయటకు పోతాయి. ఐస్ వాటర్ తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.. శరీర ఉష్ణోగ్రత కొంత తగ్గుతుంది. అయితే అధ్యయనాల ప్రకారం, చల్లని నీరు తాగడం వల్ల శరీరం థర్మోరెగ్యులేషన్ (ఉష్ణోగ్రత సమతుల్యం) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ సూచనల ప్రకారం, వ్యాయామం చేసేవారికి లేదా ఎండలో పనిచేసేవారికి చల్లని నీరు తాగడం సురక్షితమే.
Also Read..: రేణుక, సుధీర్‌లది బూటకపు ఎన్‌కౌంటర్:మావోయిస్టు పార్టీ
జాగ్రత్తలు తీసుకోవాలి..
అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఐస్ వాటర్ చాలా చల్లగా ఉంటే, ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో తాగితే గొంతు సమస్యలు లేదా జీర్ణక్రియలో అసౌకర్యం కలగవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, చల్లని నీరు జీర్ణశక్తిని కొంత మందగింపజేస్తుందని చెబుతారు. కాబట్టి, సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని ఎంచుకోవచ్చు. అలాగే, దంత సమస్యలు ఉన్నవారికి ఐస్ వాటర్ వల్ల పళ్లు సెన్సిటివ్‌గా మారే అవకాశం ఉంది.
ఐస్ వాటర్ తాగొచ్చు, కానీ..
సాధారణంగా వేసవిలో ఐస్ వాటర్ తాగొచ్చు, కానీ మితంగా, శరీర అవసరాలను బట్టి తాగాలి. ఉదాహరణకు.. బయట ఎండలో నుంచి వచ్చిన వారు వెంటనే ఐస్ వాటర్ తాగడం కంటే, కొద్దిగా చల్లని నీటితో మొదలు పెట్టి, ఆ తర్వాత ఐస్ వాటర్ తీసుకోవడం మంచిది. రోజుకు 2-3 లీటర్ల నీటిని తాగడం ఆరోగ్యానికి ఉత్తమం. అది ఐస్ వాటర్ అయినా, సాధారణ నీరు అయినా సరే. కాగా ఐస్ వాటర్ తాగడం సురక్షితమే, కానీ నీ శరీర స్థితి, ఆరోగ్య అలవాట్లను దృష్టిలో ఉంచుకోవాలి. సందేహం ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది.
మట్టి కుండలో నీరు ఆరోగ్యానికి మేలు..
ఎండాకాలం వచ్చిందంటే చల్లని నీళ్ల కోసం అందరూ ఆరాటపడతారు. ఎండలో గొంతు ఎండిపోతే ఒక గ్లాస్ కూల్ వాటర్ తాగితే ప్రాణం లేచి వస్తుంది. చాలామంది ఫ్రిజ్‌లో బాటిల్స్ పెట్టి నీళ్లు చల్లగా తాగుతారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాటికి బదులుగా మట్టి కుండలో పోసిన వాటర్ తీసుకుంటే మంచిది. వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది మట్టి కుండలనే వాడతారు.మట్టికుండలో నీళ్లు సహజంగా చల్లగా ఉంటాయి. అయితే వాటిని ఉపయోగించే ముందు బాగా కడికి క్లీన్ చేసుకుని ఉపయోగించుకోవాలి.
ఈ సంప్రదాయాన్ని మరిచిపోయారు..
వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఎక్కువగా చల్లటి నీటిని తాగుతారు. చాలా ఏళ్ల క్రితం, వేసవిలో ప్రజలు మట్టి కుండల నీరు మాత్రమే తాగేవారు, కానీ నేడు దీన్ని మరచిపోయి, ఆధునిక యుగంలో రిఫ్రిజిరేటర్లు, వాషర్లు వంటి యంత్రాల నుంచి నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ మట్టి కుండలోని నీరు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా.. చాలా సంవత్సరాల క్రితం, ప్రజలు వంటకు, తాగడానికి పనులకు మట్టి కుండలను ఉపయోగించేవారు. దీని కారణంగా వ్యాధులు చాలా అరుదుగా కనిపించేవి. ఇప్పుడు జనాలు ఈ సంప్రదాయాన్ని మరచిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భద్రాద్రిలో గరుడ ధ్వజ పట లేఖనం
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News