Summer Fruits: సమ్మర్‌లో ప్రతిరోజూ ఈ 7 పండ్లు తినండి.. సన్ ట్యానింగ్‌కు బై బై చెప్పండి..
ABN , Publish Date - Apr 15 , 2025 | 02:01 PM
Fruits For Glowing Skin in Summer: వేసవి ఎండల తాకిడికి చర్మం వేగంగా కమిలి వాడిపోతుంది. ఇక ఎక్కువసేపు మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండలో తిరిగితే చర్మం రంగే పూర్తిగా మారిపోతుంది. అదే ఈ 7 పండ్లు రోజూ తిన్నారంటే మీ ముఖం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచి..

Skin Friendly Fruits For Summer: ఎండాకాలంలో చర్మం అందంగా, తాజాగా ఉండాలంటే సన్‌స్క్రీన్, లోషన్స్ మాత్రమే వాడితే సరిపోదు. చర్మానికి బాహ్య సంరక్షణతో పాటు అంతర్గతంగా కూడా తగినన్ని పోషకాలు అందినపుడే గ్లోయింగ్ స్కిన్ సొంతమవుతుంది. ఇది తెలియక వేసవి ఉన్న కొన్ని నెలలు చర్మ సంరక్షణ అంటే కత్తి మీద సామే అనుకుంటారు చాలామంది. ఈ 7 శక్తిమంతమైన పోషకాలున్న పండ్లను ఎండాకాలంలో ప్రతిరోజూ తిన్నారంటే అందమైన మెరిసే చర్మంతో పాటు డీహైడ్రేషన్, అకాల వృద్ధాప్య ఛాయలు, ముడుతలు సమస్యలు తగ్గి యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తారు.
వేసవి నెలల్లో సహజంగా మెరిసే చర్మాన్ని పొందడానికి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన కొన్ని వేసవి పండ్లు ఇక్కడ ఉన్నాయి.
బొప్పాయి: బొప్పాయి అనేక పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన పండు. ఉదాహరణకు ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ముఖంపై మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రకాశవంతమైన చర్మాన్ని అందించేందుకు దోహదం చేస్తుంది.
పుచ్చకాయ: వేసవిలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సిన పండు. ఇందులో విటమిన్ సి, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. ఈ హైడ్రేటింగ్ పండు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది.
మామిడి పండ్లు: పండ్లలో రారాజుగా పరిగణించబడే మామిడి పండ్లు విటమిన్ ఎ, సి లతో నిండి ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషించడానికి, హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి. చర్మంపై పడిన గీతలు, ముడతలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. అయితే, మామిడి పండ్లను మితంగా తీసుకోవడం అవసరం. లేకపోతే వేడి చేస్తుంది.
పైనాపిల్: మరో రుచికరమైన, ఆరోగ్యకరమైన పండు పైనాపిల్‌లో విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడతాయి. వేసవి కాలంలో నల్ల మచ్చలు, హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యలు తొలగిపోయేందుకు ఈ పండ్లు తినడం అలవాటు చేసుకుంటే మంచివి.
కివి: ఈ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పర్యావరణ కాలుష్య ఒత్తిళ్ల నుంచి చర్మాన్ని రక్షించడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో కివి అద్భుతంగా పనిచేస్తుంది.
స్ట్రాబెర్రీలు: రుచికరమైన ఎర్రటి స్ట్రాబెర్రీలను ప్రతిరోజూ వివిధ రూపాల్లో తినవచ్చు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇది చర్మానికి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. అకాల ముడతలను, చర్మంపై గీతలను తగ్గించి నవయవ్వనంగా ఉంచుతుంది.
నారింజ: విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండే నారింజలు చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి ఉపయోగపడతాయి. స్కిన్ టోన్‌ను సమం చేయడానికి సహాయపడతాయి. వేసవిలో ఎండ వేడికి గురైనప్పుడు సర్వ సాధారణంగా వచ్చే నల్ల మచ్చలు, హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యలను వేగంగా తగ్గిస్తాయి.
Read Also: Snake Bite: పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Hair Cut: ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే మీ కొంప కొల్లేరే
North East Discovery: సెవెన్ సిస్టర్స్ అద్భుతాల్ని తరిస్తారా.. లక్కీ ఛాన్స్