Health Tips: భోజనం చివరలో పెరుగు తినడానికి కారణమేంటో తెలుసా..
ABN , Publish Date - Apr 08 , 2025 | 08:38 AM
భోజనంలో పెరుగు చాలా ముఖ్యం. దీని వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే కొంతమంది పెరుగన్నం తినకుండా ఉంటారు. దీని ప్రభావంగా జీర్ణ సమస్యలు వస్తాయి. పెరుగన్నం ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో.. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Health Tips: భోజనం చివరిలో (After Meal) పెరుగు (yogurt) తినే ఆచారం ఇప్పటికీ చాలా మంది ఆచరిస్తున్నారు. నేటి కాలంలో చాలా మంది దీనిని పాటించకపోవచ్చు. కానీ దీని వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు (Health Benefits) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది పెరుగు లేదా పాల (Milk)తో తయారు చేసిన ఉత్పత్తులను తినడానికి ఇష్టపడరు. అయితే భోజనం చివరిలో పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
Also Read..: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన
మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది..
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. అవి మంచి బ్యాక్టీరియా. అవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మనం తినే భోజనంలో మసాలాలు ఎక్కువగా ఉన్నప్పుడు, చివర్లో పెరుగు తినడం వల్ల కడుపు చల్లగా అనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. పెరుగు మన శరీరంలోని వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది. వీటిలో దేనినైనా ఎక్కువగా తీసుకోవడం లేదా తక్కువగా తీసుకోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. కాబట్టి పెరుగును ఎల్లప్పుడూ భోజనం చివరిలో తినాలని చెబుతారు. భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉండాలని పెద్దలు చెబుతారు. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది...
తక్షణ సమస్యలు రాకపోవచ్చు కానీ..
భోజనం చివరిలో పెరుగు తినకపోవడం వల్ల తక్షణ సమస్యలు రాకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనపడవచ్చు. కారంగా ఉండే ఆహారం తిన్న తర్వాత అసిడిటీ, మంట, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనిని నివారించడానికి పెరుగు మీకు సహాయపడుతుంది. అంతేకాకుండా పెరుగులోని మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని పూర్తిగా తినడం మానేసినప్పుడు, వ్యాధులను నివారించే మీ శరీర సామర్థ్యం క్రమంగా బలహీనపడుతుంది.
ఎక్కువగా తీసుకోవడంవల్ల ..
అయితే కొంతమంది పెరుగును ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తీసుకోవడంవల్ల అసిడిటీకి దారితీసే అవకాశం ఉందంటున్నారు. కొంతమంది అయితే మాంసంతో పెరుగు తింటారు. ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సరైన సమయంలో, సరైన పరిమాణంలో పెరుగు తీసుకుంటేనే దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
చల్లని పెరుగు తీసుకుంటే...
ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం.. రోజుకు 100-150 గ్రాముల పెరుగు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. భోజనం చివర్లో పెరుగన్నం తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే ఎక్కువ మోతాదులో చల్లని పెరుగు తీసుకుంటే కొంతమందిలో జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. లాక్టోస్ అసహ్యత (Lactose Intolerance) ఉన్నవారు అయితే రోజుకు 50-75 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
NTR వైద్యసేవా ట్రస్టు కింద వైద్య సేవలు పునఃప్రారంభం
For More AP News and Telugu News