Share News

Breaking News: వరంగల్ జిల్లా కోర్టులో బాంబు కలకలం.. ఏకంగా జడ్జికి మెయిల్

ABN , First Publish Date - Apr 04 , 2025 | 09:28 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: వరంగల్ జిల్లా కోర్టులో బాంబు కలకలం.. ఏకంగా జడ్జికి మెయిల్
Breaking News

Live News & Update

  • 2025-04-04T12:59:38+05:30

    వరంగల్ జిల్లా కోర్టులో బాంబు కలకలం

    • వరంగల్ జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ జడ్జికి సమాచారం

    • జిల్లా జడ్జికి మెయిల్ పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి

    • వరంగల్ బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం

    • కోర్టు ప్రాంగణానికి చేరుకున్న వరంగల్ బాంబ్ స్క్వాడ్

  • 2025-04-04T12:16:27+05:30

    టీటీడీకి హైకోర్టులో భారీ ఊరట

    • హైకోర్టులో టీటీడీకి భారీ ఊరట..

    • తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తనను తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా బదిలీ చెయ్యాలని హైకోర్టుని ఆశ్రయించిన పెద్దింటి కుటుంబానికి చెందిన శ్రీనివాస దీక్షితులు

    • శ్రీనివాస దీక్షితుల పిటిషన్‌ని కొట్టేసిన హైకోర్టు

    • పరిపాలన పరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం

    • ఉద్యోగిగా టీటీడీ ఎక్కడ విధులు కేటాయిస్తే అక్కడ నిర్వర్తించాలని పిటిషనర్‌ని ఆదేశించిన హైకోర్టు

  • 2025-04-04T11:10:58+05:30

    ఉప్పల్‌లో ఆందోళన

    • ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ వద్ద స్థానికుల ఆందోళన.

    • 7ఏళ్లుగా ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయకపోవడంతో ఆందోళన

    • ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించిన స్థానికులు.

    • ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆగ్రహం

    • ట్రాఫిక్‌తో పాటు, ప్రమాదాల బారిన పడుతున్నామంటూ స్థానికుల ఆందోళన

    • నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ నిరసన

  • 2025-04-04T11:10:57+05:30

    గోదావరి కరకట్ట విస్తరణ పనులు పరిశీలన

    • భద్రాచలం సుభాష్ నగర్ వద్ద గోదావరి కరకట్ట విస్తరణ పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

    • కరకట్ట పనుల్లో జాప్యం పట్ల ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం

    • కరకట్టకు ఆటోమేటిక్ షట్టర్లు ఏర్పాటు చేయాలని సూచన

    • పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం

  • 2025-04-04T11:10:56+05:30

    ఆసుపత్రిలో మంత్రి సీతక్క తనిఖీ

    • ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ

    • ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా

    • రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని సూపరిండెంట్‌ను మందలించిన మంత్రి సీతక్క

  • 2025-04-04T10:50:13+05:30

    కేసీఆర్ వరుస సమావేశాలు

    • ఇవాళ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ నేతలతో కేసీఆర్ సమావేశం

    • ఈనెల 27న సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్లపై నేతలకు సలహాలు , సూచనలు ఇవ్వనున్న కేసీఆర్

    • ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్

  • 2025-04-04T09:28:59+05:30

    మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

    • మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు

    • రాష్ట్రపతి ఆమోదంతో మణిపూర్‌లో ప్రెసిడెంట్ రూల్

    • రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదించిన కేంద్ర హోంశాఖ

    • ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనపై ప్రకటన