Share News

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Apr 15 , 2025 | 09:21 PM

మెట్రో రైల్లో సీట్లో కూర్చొన్న ఓ యువకుడు మధ్యలో నిద్రలోకి జారుకుంటాడు. దీంతో ముందుకు తూగుతూ నిద్రపోతుంటాడు. ఇలా ముందుకు, వెనక్కు తూగుతూ నిద్రపోతూ ఇబ్బంది పడుతుంటాడు. అతన్ని గమనించిన ఓ యువతి చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

సినిమాల్లో చూసే ఫన్నీ ఘటనలన్నీ కొన్నిసార్లు మెట్రో రైళ్లలో కనిపిస్తుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చాలా మంది యువతులు కూడా రైళ్లలో ప్రయాణికుల సమక్షంలో విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెట్రో రైల్లో ఓ యువకుడు నిద్రపోతుండగా.. యువతి గమనిస్తుంది. చివరకు ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మెట్రో రైల్లో (Metro Train) సీట్లో కూర్చొన్న ఓ యువకుడు మధ్యలో నిద్రలోకి జారుకుంటాడు. దీంతో ముందుకు తూగుతూ నిద్రపోతుంటాడు. ఇలా ముందుకు, వెనక్కు తూగుతూ నిద్రపోతూ ఇబ్బంది పడుతుంటాడు.

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..


ఆ యువకుడి ఇబ్బంది గమనించిన ఓ యువతి.. మెల్లిగా దగ్గరికి వెళ్తుంది. నిద్రపోతున్న (Young woman helped sleeping man) యువకుడి తలను తనకు ఆనించుకుంటుంది. ఆ తర్వాత అతడి తలపై చేయి పెట్టి నిమురుతూ నిద్రపుచ్చుతుంది. అయితే కాసేపటి తర్వాత సడన్‌గా కళ్లు తెరచిన ఆ యువకుడు.. తాను చేసిన పొరపాటను గ్రహిస్తాడు.

Jugad Viral Video: సీలింగ్ ఫ్యాన్‌తో ఏసీ ఎఫెక్ట్.. ప్రయోగం చూశారంటే నోరెళ్లబెట్టాల్సిందే..


తర్వాత ఆమెకు సారీ చెప్పి స్టడీగా కూర్చుంటాడు. చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం కావాలని చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె చేసిన సాయం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే ఇదంతా స్క్రిప్టెడ్‌లా అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Couple Viral Video: మేడపై రీల్ చేస్తున్న భార్య.. వద్దంటూ గొడవకు దిగిన భర్త.. చివరకు జరిగిందేంటో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2025 | 09:21 PM