Share News

Haryana Police: పోలీసులపై దాడి.. సినిమా స్టైల్‌లో రెచ్చిపోయిన దుండగులు

ABN , Publish Date - Jan 28 , 2025 | 09:55 PM

Haryana Police: పోలీసులపై దుండగులు దాడులకు తెగ బడుతున్నారు. ఇది ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశంలో ఎక్కడో అక్కడ..ఎప్పుడో అప్పుడు ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకొంటున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఇదే తరహా చోటు చేసుకొంది.

Haryana Police: పోలీసులపై దాడి.. సినిమా స్టైల్‌లో రెచ్చిపోయిన దుండగులు

జైపూర్, జనవరి 28: ఆన్‌లైన్ మోసాలతోపాటు యూఎస్ డాలర్లను అక్రమ మార్గాల్లో మారుస్తోన్న ఓ గ్యాంగ్ ఆట కట్టించేందుకు హర్యానా పోలీసులు రంగంలోకి దిగారు. ఆ నేరాలకు సంబంధించిన మూలాలు రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆ క్రమంలో రాజస్థాన్‌లోని కుచ్‌మన్‌లో రాణాసర్ చేరుకొని.. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం అతడిని హర్యానాకు కారులో తరలించారు. ఈ విషయాన్ని గమనించిన ఆ గ్యాంగ్‌లోని వ్యక్తులు.. మరో వాహనంలో పోలీసుల కారును వెంబడించారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి పోలీసుల కారు చేరుకొంది. దీంతో ఆ కారును ఈ గ్యాంగ్ ప్రయాణిస్తున్న కారుతో పలుమార్లు ఢీ కొట్టారు. ఈ ఘటనలో పోలీసుల కారు పూర్తిగా దెబ్బతింది. అదే సమయంలో పోలీసులపై దాడికి దిగారు. దాంతో వారు భయంతో పరుగులు తీశారు. అయితే పోలీస్ కారు డ్రైవర్‌ను గ్యాంగ్‌లోని దుండగులు తమతో తీసుకు వెళ్లారు. ఈ వ్యవహారంపై పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించారు.


అనంతరం దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా గ్యాంగ్‌లోని వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీస్ వ్యాన్ డ్రైవర్‌ను వదిలి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఈ గ్యాంగ్ లోని సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: ఆయన ఎలాంటి వారో దగ్గర నుంచి చూశా.. సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు


దీంతో ఈ కేసులో ఓ నిందితుడిని చితావా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు దుండగుల దాడిలో గాయపడిన వారిని పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరిన్నీ తెలుగు వార్తలు కోసం..

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం

Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

For National News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 09:58 PM