DGGI: 357 బెట్టింగ్ వెబ్‌సైట్లు బ్లాక్
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:03 AM
భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబలింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో 700 ఆఫ్‌షోర్ సంస్థలపై నిఘా పెట్టింది.

న్యూఢిల్లీ, మార్చి 22 : ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్స్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) విభాగం కొరడా ఝళిపించింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్, చెల్లింపుల్లో అవకతవకలకు, నిబంధనల అతిక్రమణకు పాల్పడిన సంస్థలకు చెందిన 357 వెబ్‌సైట్లను ఇప్పటిదాకా బ్లాక్ చేసింది. భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబలింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో 700 ఆఫ్‌షోర్ సంస్థలపై నిఘా పెట్టింది. అనధికార ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇటీవల తీసుకున్న చర్యల్లో భాగంగా 2000 బ్యాంకు ఖాతాలు, రూ.4కోట్ల నగదును డీజీజీఐ అటాచ్ చేసింది. అలాగే, ఆఫ్‌షోర్ గేమింగ్ వెబ్‌సైట్లలో నగదు లావాదేవీలకు వినియోగిస్తున్న యూపీఐ ఐడీలకు అనుసంధానమైన 392 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన డీజీజీఐ రూ.122.05 కోట్లను అటాచ్ చేసింది. కాగా, విదేశాల్లో ఉంటూ నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా భారతీయుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సద్గురు, మహఖాల్, అభి247 తదితర ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన ముగ్గురిని డీజీజీఐ ఇటీవల అరెస్టు కూడా చేసింది.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News

దేవుళ్లు సరిగానే ఉన్నారు... కొందరు మనుషులే తేడా..

వాహనదారులకు నిజంగా ఇది పిడుగులాంటి వార్త.. అదేంటో తెలిస్తే..

నాలుగు రోజులు ఎండ తీవ్రం.. మధ్యాహ్నం ఇంటివద్దే ఉండండి

ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్నే మార్చాలంటారా?

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్‌ఫోర్స్
