Share News

E-Pass: ఊటీ, కొడైకెనాల్‌లో ఈ-పాస్‌ ప్రారంభం

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:27 AM

మీరు ఊటీ, కొడైకెనాల్‌ వెళ్తున్నారు.. అయితే.. ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా వాహనాల్లో వెళ్లేవారైతే తప్పకుండా తెలుసుకోవాల్సాందే మరి. రాష్ట్ర ప్రభుత్వం ఈ-పాస్‌ విధానాన్ని ప్రారంభించింది. వాహనాల రద్దీ తగ్గించేందుకుగాను రూపొందించిన ఈ-పాస్‌ విధానం అక్కడ అమల్లోకి వచ్చింది.

E-Pass: ఊటీ, కొడైకెనాల్‌లో ఈ-పాస్‌ ప్రారంభం

- లేకుంటే వాహనాలకు అనుమతి లేదు

చెన్నై: రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన వేసవి విడిది ప్రాంతాలైన నీలగిరి జిల్లా ఊటీ, దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌లకు వాహనాల రద్దీ తగ్గించేందుకు రూపొందించిన ఈ-పాస్‌ విధానం మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. నీలగిరి(Neelagiri) జిల్లాకు ప్రతి ఏడాది 30 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా, ఏప్రిల్‌, మే నెలల్లో రోజుకు 30వేల మంది ఇక్కడికి రావడంతో వాహనాల రద్దీ నెలకొంటుంది. పర్యాటకుల సంఖ్య నియంత్రించేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేలా ఊటీ, కొడైకెనాల్‌ ప్రాంతాలకు వెళ్లే వాహనాల సంఖ్య తగ్గించేలా ఈ-పాస్‌ విధానం అమలుచేయాలని మద్రాసు హైకోర్టు(Madras High Court) ఉత్తర్వులు జారీచేసింది.

ఈ వార్తను కూడా చదవండి: PM Modi: 6న రామేశ్వరంలో ప్రధాని మోదీ పర్యటన


ఈ ప్రకారం, మంగళవారం (ఏప్రిల్‌ 1వ తేది) నుంచి జూన్‌ చివరివారం వరకు, ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 6వేలు వాహనాలు, శని, ఆదివారాల్లో 8వేలు వాహనాలను మాత్రమే నీలగిరి జిల్లాలోకి అనుమతించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, ఉద్యానవన శాఖల అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, నీలగిరి జిల్లా రిజిస్ట్రేషన్‌ కలిగిన వాహనాలు, అంబులెన్స్‌లు, వైద్య సేవలకు సంబంధించిన వాహనాలకు ఈ-పాస్‌ విధానం నుంచి జిల్లా యంత్రాంగం మినహాయింపు కల్పించింది.


nani2.2.jpg

జిల్లా సరిహద్దుల్లో ఉన్న కల్లారు, కుంజప్పనై, ముల్లి, సుక్కానల్లా, పట్టవయల్‌, కేరంబాడి తదితర ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో ఈ-పాస్‌ ఉన్న వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. అదే విధంగా, దిండుగల్‌ జిల్లాలోని కొడైకెనాల్‌లో కూడా ఈ-పాస్‌ విధానం అమలులోకి వచ్చింది. జిల్లా రిజిస్ట్రేషన్‌ నెంబర్లు కలిగిన వాహనాలు మినహాయించి మిగతా వాహనాలు రోజుకు 4వేలు, శని, ఆదివారాల్లో 6వేల వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.


కొండపైకి వెళ్లే వాహనాల వల్ల కలిగే రద్దీ నియంత్రించేలా అబ్జర్వేటరీ, రోజ్‌ గార్డెన్‌, బ్రియాంట్‌ పార్క్‌ రోడ్డు ప్రాంతాల్లో తాత్కాలిక పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. పర్యాటకులతో సంప్రదింపులు జరిపేలా జిల్లా యంత్రాంగం క్యూ ఆర్‌ కోడ్‌ సదుపాయం కూడా కల్పించింది. ఇదిలా ఉండగా, నీలగిరి, కొడైకెనాల్‌ ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఈ-పాస్‌ విధానం అమలుకు రావడంతో, ఈ-పాస్ ల కోసం కౌంటర్ల వద్ద వాహనాల్లో వచ్చిన పర్యాటకులు బారులుతీరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!

విధ్వంసమే మీ ఎజెండానా

డబుల్‌ బెంబేలు

ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 02 , 2025 | 11:58 AM