CBHFL Jobs: డిగ్రీ చేసిన ఉద్యోగార్థులకు జాబ్ ఆఫర్స్..45 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:10 PM
బ్యాంకు పరీక్షల కోసం పోటిపడుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (CBHFL)లో 212 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

డిగ్రీ చేసిన ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (CBHFL) 2025లో 212 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డిగ్రీ అర్హతతో అనేక రకాల పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ చేసిన వారికి ఎక్కువ పోస్టులుండగా, మిగతా వారికి కొన్ని తక్కువ జాబ్స్ కలవు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 4, 2025న మొదలు కాగా, ఏప్రిల్ 25, 2025న ముగుస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్‌లోని ఖాళీలు అర్హతలు ఎలా ఉన్నాయి, దరఖాస్తు ఫీజు వంటి ఇతర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అనుబంధ సంస్థగా..
సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (CBHFL) అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఇది భారతదేశంలో ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థగా CBHFL గుర్తింపుపొందింది. ఈ సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB), హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (HUDCO), స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (SUUTI) వంటి సంస్థల సహకారంతో పని చేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా..
CBHFL ప్రధానంగా గృహ రుణాలు, టాప్ అప్ రుణాలు, ఆస్తి రుణాలు, వాణిజ్య ఆస్తి రుణాలు వంటి హౌసింగ్ ఫైనాన్స్ పరిష్కారాలను అందిస్తుంది. ఈ సంస్థ భారతదేశం మొత్తం తన సేవలను కొనసాగిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 212 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలు వివిధ గ్రేడ్‌లలో విభజించబడ్డాయి. గ్రేడ్, అర్హత, పని అనుభవం ఆధారంగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో హైదరాబాద్, విజయవాడ సహా ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.
ఈ పోస్టుల విభజన క్రింది విధంగా ఉంది:
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 15
సీనియర్ మేనేజర్ 2
మేనేజర్ 48
అసిస్టెంట్ మేనేజర్ 2
జూనియర్ మేనేజర్ 34
ఆఫీసర్ 111
టోటల్ 212
గమనిక: ఈ ఖాళీల సంఖ్య పరిమితం మాత్రమే. అవసరాల ఆధారంగా మార్పులు జరగవచ్చు. రిజర్వ్ కేటగిరీలకు (SC/ST/OBC) గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థులు అర్హత ప్రమాణాల గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. వయసు కట్ ఆఫ్ తేదీ 2025 ఫిబ్రవరి 1గా పరిగణించబడుతుంది.
CBHFL రిక్రూట్‌మెంట్ 2025: అర్హత ప్రమాణాలు
ఆఫీసర్ స్థాయి (సేల్స్ మేనేజర్, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్): 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 1 సంవత్సరం సంబంధిత అనుభవం అవసరం
జూనియర్ మేనేజర్ స్థాయి (బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్): గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు, 2 సంవత్సరాలు సంబంధిత అనుభవం అవసరం
మేనేజర్ స్థాయి (స్టేట్ కలెక్షన్ మేనేజర్, బ్రాంచ్ హెడ్): గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు, 5-7 సంవత్సరాలు సంబంధిత అనుభవం ఉండాలి
సీనియర్ మేనేజర్ స్థాయి (లీగల్/టెక్నికల్ మేనేజర్): 6 సంవత్సరాలు సంబంధిత అనుభవంతో, LLB/సివిల్ ఇంజనీరింగ్/ఆర్కిటెక్చర్ వంటి నిర్దిష్ట డిగ్రీలు అవసరం
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయి (బిజినెస్/క్రెడిట్ హెడ్): 5-10 సంవత్సరాలు అనుభవంతో, గ్రాడ్యుయేట్ డిగ్రీ (ప్రత్యేక అర్హతలు అవసరం).
వయోపరిమితి (01.02.2025 నాటికి):
ఆఫీసర్ పోస్టులకు 18 – 30 సంవత్సరాలు
జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు 21 – 28 సంవత్సరాలు
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 23 – 32 సంవత్సరాలు
మేనేజర్ స్థాయి పోస్టులకు 25 – 35 సంవత్సరాలు
సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు 28 – 40 సంవత్సరాలు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు 30 – 45 సంవత్సరాలు ఉండాలి.
గమనిక: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది
CBHFL రిక్రూట్‌మెంట్ 2025: ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభం: 04.04.2025
ఆన్‌లైన్ దరఖాస్తు & ఫీజు చెల్లింపు ముగింపు: 25.04.2025
అభ్యర్థుల హాల్ టికెట్ విడుదల తేదీ: మే 2025
రాతపరీక్ష తేదీ: జూన్ 2025
ఇంటర్వ్యూ తేదీ: జూలై 2025
ముఖ్య గమనిక: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/బోర్డుల నుంచి డిగ్రీ చేసిన వారి అర్హతలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థులు అనుభవ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
CBHFL రిక్రూట్‌మెంట్ 2025కి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2025 ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమై 25 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ అర్హతను సమర్పించి, సరిగ్గా అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చు.
ఇవి కూడా చదవండి:
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News

నార్కోటిక్ బ్యూరోలో జాబ్స్..నో ఎగ్జామ్, 56 ఏళ్ల వరకూ ఛాన్స్.

PM ఇంటర్న్‌షిప్‌కు వెంటనే అప్లై చేసుకోండి.. లాస్ట్ డేట్..

రైల్వేలో 9,970 ఖాళీలకు నోటిఫికేషన్..

ఎన్టీపీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్..ఈ అభ్యర్థులకు మంచి ఛాన్స్

హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..అప్లై చేశారా
