BJP: అధికారం చేపట్టే స్థాయికి పార్టీని తీసుకెళతా..
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:38 PM
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం చేపట్టే స్థాయికి తీసుకెళతానని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈపీఎస్ నేతృత్వంలోని కూటమి మెజార్టీ స్థానాలు సాధించి అధికారం కైవసం చేసుకుంటుందని ఆయన అన్నారు.

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్
చెన్నై: అధికారం చేపట్టే స్థాయికి పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP State President Nainar Nagendran) తెలిపారు. కన్నియాకుమారి భగవతి అమ్మన్ ఆలయాన్ని సోమవారం నయినార్ నాగేంద్రన్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలకు తమిళ ఉగాది(Tamil Ugadi) శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Jayakumar: నేను పార్టీ నుంచి వైదొలగే ప్రసక్తే లేదు..
అన్నామలై నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ(BJP) అభివృద్ధి సాధించిందన్నారు. బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టేలా కృషి చేస్తానన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈపీఎస్(EPS) నేతృత్వంలోని కూటమి మెజార్టీ స్థానాలు సాధించి అధికారం కైవసం చేసుకుంటుందని నయినార్ నాగేంద్రన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!
తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు
Read Latest Telangana News and National News