Share News

Family Murder Tragedy: అత్త, మరదలు, కూతురును కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:45 AM

కర్ణాటకలోని చిక్కమగళూరులో వ్యక్తి తన అత్త, మరదలు, కూతురును కాల్చి చంపి, చివరగా తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వదిలేసి వెళ్లిన విషయంపై ఊర్లో మాటలు పెరగడం, కూతురు పాఠశాలలో ప్రశ్నలు ఎదుర్కొవడం కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు

Family Murder Tragedy: అత్త, మరదలు, కూతురును కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య

  • వదిలేసి వెళ్లిన భార్య గురించి

ప్రశ్నిస్తుండడంతో మనస్తాపం

  • కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరులో దారుణం

బెంగళూరు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): భార్య వదిలేసి వెళ్లిన విషయాన్ని గ్రామస్థులు తరచూ ప్రస్తావించడం, పాఠశాలలో కూతురుని ‘మీ అమ్మ ఏమైంది..?’ అని తోటివిద్యార్థులు ప్రశ్నిస్తుండడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ వ్యక్తి కూతురు, అత్త, మరదలుని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తరువాత అదే తుపాకీతో తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరదలి భర్త బుల్లెట్‌ గాయాలతో బతికి బయటపడ్డాడు. కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రత్నాకర్‌(40) అనే వ్యక్తి కడబగెరెలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా రెండేళ్ల క్రితం ఆయనను భార్య వదిలి వెళ్లిపోయింది. రత్నాకర్‌, అతని కూతురు మౌల్యతో పాటు అతని అత్త జ్యోతి కూడా ఉంటున్నారు. కాగా, భార్య వెళ్లిపోయిన విషయం గురించి ఇటీవల గ్రామస్థులు తరచూ రత్నాకర్‌ వద్ద ప్రస్తావించారు. రత్నాకర్‌ తట్టుకోలేకపోయాడు. తనను మోసగించారని అత్త, మరదలు, ఆమె భర్తతో మంగళవారం రాత్రి గొడవపడ్డాడు. నాటు తుపాకీతో అత్త జ్యోతి(50), కూతురు మౌల్య(6), మరదలు సింధు(24)ను కాల్చి చంపాడు. తర్వాత అదే తుపాకీతో రత్నాకర్‌ కాల్చేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్

Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే

Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

For National News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 04:46 AM