Share News

Judge Transfer Row: కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదు

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:28 AM

కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదని న్యాయవాదులు విమర్శిస్తూ, జస్టిస్‌ దినేశ్‌ శర్మ బదిలీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆయనకు న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని, కోర్టు విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు

Judge Transfer Row: కలకత్తా హైకోర్టు చెత్తకుప్ప కాదు

జస్టిస్‌ దినేశ్‌ శర్మ బదిలీపై లాయర్ల నిరసన

కోల్‌కతా, ఏప్రిల్‌ 2: తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, రిటైర్మెంట్‌కు దగ్గర పడిన న్యాయమూర్తులను పంపించడానికి కోల్‌కతా హైకోర్టు చెత్తకుప్ప ఏమీ కాదని హైకోర్టుకు చెందిన మూడు న్యాయవాద సంఘాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ శర్మను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయడంపై తీవ్ర వ్యతిరేకత ప్రకటించాయి. ఆయన ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు హైకోర్టు సీజే జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానంకు లేఖ రాశాయి. జస్టిస్‌ వర్మకు న్యాయపరమైన విధులు అప్పగించవద్దని, ఆయనకు కేసులు కేటాయిస్తే కోర్టుకు హాజరు కాబోమని లాయర్లు హెచ్చరించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు నిరసనగా హైకోర్టు న్యాయవాదులు మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ కోర్టు విధులను బహిష్కరించారు. కొలీజియం మార్చి 27న చేసిన సిఫారసును పునఃసమీక్షించి, వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్

Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే

Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

For National News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 04:32 AM