Minister: ఈడీ అభియోగాలపై న్యాయపరమైన చర్యలు..
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:39 PM
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేసిన అభియోగాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి సెంథిల్‌బాలాజీ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ మద్యం దుకాణాల్లో రూ. వెయ్యి కోట్లకుపైగా అవినీతి జరిగిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అభియోగాల మోపారు.

- మంత్రి సెంథిల్ బాలాజీ
చెన్నై: రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ మద్యం దుకాణాల్లో రూ. వెయ్యి కోట్లకుపైగా అవినీతి జరిగిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేసిన అభియోగాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి సెంథిల్‌బాలాజీ(Senthil Balaji) ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ టాస్మాక్ ప్రధాన కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెల్సిందే. ఈ తనిఖీలకు సంబంధించి ఈడీ అధికారులు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీనిపై మంత్రి సెంథిల్ బాలాజీ మీడియాతో మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Viral News: తాగలేదు, ఎయిర్‌బ్యాగ్స్ వల్లే ప్రమాదమన్న యువకుడు..నిజమేనా..
ఇటీవల టాస్మాక్ ప్రధాన కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన తనిఖీలపై ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టత లేదన్నారు. అంతేకాకుండా మూతపడిన టాస్మాక్ దుకాణాల్లో పనిచేసిన 2,157 మంది సిబ్బందికి 2023లో ఇతర ప్రాంతాలకు బదిలీ చేసామన్నారు. ఇవన్నీ న్యాయబద్ధంగా జరిగాయని పేర్కొన్నారు. రవాణా ఒప్పందాల్లో ఫిబ్రవరి 2023లో ఆహ్వానించిన టెండర్లలో అతి తక్కువ ధరకు కోడ్ చేసిన సంస్థలకే అప్పగించడం జరిగిందన్నారు. ఇందులో కేవైసీతో పాటు బ్యాంకు వివరాలన్నీ పక్కాగా తనిఖీ చేయడం జరిగిందన్నారు.
ఈ రవాణా ఒప్పందాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. అయితే, కొన్ని రవాణా ఒప్పందాలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కావడంతో హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. టాస్మాక్ దుకాణాల నగదు లావాదేవీల్లో ప్రతి ఒక్కటీ పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో టాస్మాక్ దుకాణాల్లో వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈడీ అధికారులు చేసిన ప్రటనల సత్యదూరమన్నారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సెంథిల్ బాలాజీ పేర్కొన్నారు.
టాస్మాక్ అధికారులకు సమన్లు
టాస్మాక్ దుకాణాల్లో అవినీతి జరిగినట్టు ఈడీ అధికారుల తనిఖీల్లో తేలింది. దీనికి సంబంధించి పలువురు టాస్మాక్ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసి, విచారణ జరపాలని అధికారులు భావిస్తున్నారు. ఈ అవినీతిలో అధికారుల పాత్ర ఉన్నట్టు తేలితే సంబంధింత అధికారులను అరెస్టు చేసే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Arjun Reddy: గ్రూప్-3 టాపర్లూ పురుషులే..
నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం
Read Latest Telangana News and National News