ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahakumbha Mela : గంగా స్నానంతో జన్మ ధన్యమైంది.. మహా కుంభమేళాలో విదేశీ భక్తులు

ABN, Publish Date - Jan 13 , 2025 | 04:08 PM

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం 'మహా కుంభ్' ఈరోజు సోమవారం పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. 144 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభంలో పాల్గొనేందుకు భారతీయులే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రోజే అమృత స్నానంలో పాల్గొనడం అద్భుత అనుభూతిని కలిగించిందని పలువురు విదేశీయులు అంటున్నారు..

Foreign Devotees at Mahakumbh Mela 2025

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం 'మహా కుంభ్' ఈరోజు సోమవారం పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. 144 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభంలో పాల్గొనేందుకు భారతీయులే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇటలీ, జర్మనీ, అర్జెంటీనా సహా పలు దేశాలకు చెందిన భక్తులు 'హర్ హర్ గంగా' అంటూ త్రివేణిసంగమంలో నినాదాలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానాలు ఆచరించి విదేశీ భక్తులు పులకించిపోయారు. తొలి రోజే అమృత స్నానంలో పాల్గొనడం అద్భుత అనుభూతిని కలిగించిందని పలువురు విదేశీయులు అంటున్నారు. గడ్డకట్టే చల్లటి వాతారవరణం ఉన్నా గంగా జలంలో పవిత్ర స్నానం తర్వాత హృదయం వెచ్చని అనుభూతితో నిండిపోయిందని, భారతీయ సంస్కృతిలోని గొప్పదనమే అదంటూ ఆధ్యాత్మిక ఆనందంలో తేలియాడుతున్నారు.


మోక్షాన్ని వెతుక్కుంటూ వచ్చా..బ్రెజిల్ భక్తుడు

నీరు గడ్డకట్టుకుపోతున్నప్పటికీ ఈ విదేశీ భక్తుల బృందం త్రివేణి సంగమంలో స్నానమాచరించింది. మోక్షాన్ని వెతుక్కుంటూ తొలిసారిగా భారత్‌కు వచ్చిన బ్రెజిల్ భక్తుడు ఫ్రాన్సిస్కో.. తొలి అమృత్ స్నాన్‌లో పాల్గొనడం అద్భుతమైన అనుభూతి అని అన్నారు. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, 'నేను మొదటిసారిగా భారతదేశానికి వచ్చాను. నేను యోగా సాధన చేసి మోక్షాన్ని వెతుకుతున్నాను. ఇక్కడ ఉండటం అద్భుతంగా అనిపిస్తుంది. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక హృదయం. నది నీరు చల్లగా ఉంటుంది, కానీ స్నానం చేసిన తర్వాత హృదయం వెచ్చదనంతో నిండి ఉంటుంది.


అదృష్టంగా భావిస్తున్నాను..

స్పెయిన్‌కు చెందిన మరో భక్తుడు మాట్లాడుతూ.. ఇక్కడ స్నానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నా. స్పెయిన్, బ్రెజిల్, పోర్చుగల్ నుంచి కొందరం బృందంగా ఏర్పడి ఈ ఆధ్యాత్మిక యాత్రకు వచ్చాం. నేను పవిత్ర స్నానం చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను అన్నాడు. మరొక భక్తుడు, జర్మనీకి వలస వెళ్లిన మైసూర్ వాసి జితేష్ ప్రభాకర్ తన జర్మన్ భార్య సస్కియా నాఫ్, నెలల చిన్నారివు ఆదిత్యతో కలిసి అమృత స్నానం చేసేందుకు తెల్లవారుజామునే ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నాడు. విదేశాల్లో ఉన్నా దేశంతో, సంస్కృతితో అనుబంధం వదులుకోవద్దని, అందుకే తానూ కుటుంబసమేతంగా మహా కుంభమేళాకు వచ్చానని తెలిపాడు.


దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన ఓ భక్తుడు 'ఇది చాలా అందంగా ఉంది. ఇక్కడ రోడ్లు శుభ్రంగా ఉన్నాయి. ప్రజలు చాలా స్నేహపూర్వకంగా, సంతోషంగా ఉన్నారు... మేము సనాతన ధర్మాన్ని అనుసరిస్తాము...'. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు చెందిన నిక్కీ అనే మరో భక్తురాలు, 'గంగా నది వద్దకు పవిత్ర స్నానం కోసం రావడం మా అదృష్టం" అని చెప్పుకొచ్చింది.


తొక్కిసలాట జరగకుండా రవాణా ఏర్పాట్లు

ఇదిలావుండగా, మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు భద్రతతో పాటు వాహనాలు సజావుగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాట జరగకుండా త్రివేణిలో ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. కుంభమేళాను సందర్శించే భక్తుల భద్రత కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బృందాలు ఏర్పాటయ్యాయి. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ఈ మహా కుంభమేళా ప్రాముఖ్యత ఈ సంవత్సరం మరింత పెరిగింది.

Updated Date - Jan 13 , 2025 | 04:10 PM