Share News

Nizamabad crime: నిజామాబాద్‌లో మహిళ దారుణ హత్య!

ABN , Publish Date - Mar 29 , 2025 | 06:09 AM

నిజామాబాద్‌లో ఓ మహిళను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని మాయం చేయ하려던 నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఆమె మృతదేహాన్ని తీసుకెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు.

Nizamabad crime: నిజామాబాద్‌లో మహిళ దారుణ హత్య!

కారులో మృతదేహాన్ని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

ఖిల్లా (నిజామాబాద్‌), మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఓ మహిళను దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించిన నిందితుడిని నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నిజామాబాద్‌ నగర శివారులోని దాస్‌నగర్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నిజామాబాద్‌ నుంచి మాక్లూర్‌ వైపు వేగంగా వెళుతున్న ఓ కారును ఆపేందుకు యత్నించారు. ఆ కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించారు. గమనించిన నిందితుడు కొద్ది దూరం వెళ్లాక కారులోని మహిళ మృతదేహాన్ని నిజాంసాగర్‌ కాలువలో పడేసేందుకు యత్నించాడు. కానీ అదే సమయానికి అక్కడకు చేరుకున్న పోలీసులు.. కారు డిక్కీలో మహిళ మృతదేహం ఉండడం చూసి కారుతోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన మహిళను నిజామాబాద్‌లోని ముబారక్‌నగర్‌కు చెందిన కమల (46)గా గుర్తించారు. ఆమె గురువారం నుంచి కనిపించడంలేదని కుటుంబసభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 29 , 2025 | 06:09 AM