Pareeksha Pe Charcha 2025: పరీక్షా పే చర్చలో తెలుగమ్మాయి.. ప్రధానిని ఏం అడిగిందంటే..
ABN , Publish Date - Feb 10 , 2025 | 01:18 PM
PM Modi: ప్రతి ఏటా పరీక్షా పే చర్చ కార్యక్రమంతో విద్యార్థులతో ముచ్చటిస్తుంటారు ప్రధాని మోడీ. ఈ ఏడాది కూడా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ తెలుగమ్మాయి నుంచి ప్రధానికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

పరీక్షల విషయంలో విద్యార్థుల్లో ఉండే భయం, ఒత్తిడి, ఆందోళనను తొలగించేందుకు కృషి చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగింపులో ఫైనల్స్ ఎగ్జామ్స్‌కు ముందు పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తుంటారు మోడీ. ఇందులో స్టూడెంట్స్‌తో ముచ్చటిస్తూ వాళ్లకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. చదవింది అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, దాన్ని పరీక్షల్లో బాగా రాయడం ఎలాగో వివరిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఆయన మరోమారు పరీక్షా పే చర్చలో పాల్గొన్నారు. అయితే ఓ తెలుగమ్మాయి నుంచి ఆయనకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ప్రధానిని ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
అమ్మ కోసం ఒక మొక్క!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి శస్త్ర అనే బాలిక పరీక్షా పే చర్చ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని.. ప్రధాని మోడీని ఆసక్తికర ప్రశ్న అడిగింది. ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని.. ప్రకృతిని కాపాడుకునేందుకు ఏమేం చేయాలని ఆమె క్వశ్చన్ చేసింది. దీనికి ప్రధాని స్పందిస్తూ.. ‘ఇది చాలా మంచి ప్రశ్న. వాతావరణం గురించి పిల్లలు ఆలోచిస్తుండటం శుభపరిణామం. భోగాలు అనుభవించాలని అనుకునే కొందరు తమ సంతోషం కోసం ప్రకృతిని నాశనం చేశారు. ప్రకృతిని నాశనం చేయడం మన కల్చర్ కాదు’ అని మోడీ చెప్పుకొచ్చారు. లైఫ్ స్టైల్ అనేది తన మిషన్ అని.. దీనర్థం ప్రకృతిని కాపాడేలా మన జీవనశైలిని మార్చుకోవడమేనని తెలిపారు ప్రధాని. నేల, నీరును తల్లిగా భావించడం మన సంప్రదాయమని వ్యాఖ్యానించారు. ప్రకృతి సంరక్షణలో భాగంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ కోసం ఒక మొక్క)’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరితో చెట్లు నాటిస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి:
మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
ఢిల్లీ విజయంలో ఒకే ఒక్కడు.. మోదీని మించి..
మణిపూర్ సీఎం బీరెన్‌సింగ్ రాజీనామా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి