Modi Gifts: బూట్లు ఇచ్చి 14 ఏళ్ల శపథాన్నివిరమింపజేసిన మోదీ
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:50 AM
ప్రధాని మోదీని కలిసే వరకూ చెప్పులు వేయనని 14 ఏళ్లుగా శపథం చేసిన రాంపాల్ కాశ్యప్‌కు మోదీ బూట్లు బహుకరిచారు తన అభిమానానికి తలవంచిన మోదీ, ఇకపై ఇలాంటి శపథాలు చేయొద్దని హితవు పలికారు

యమునానగర్, ఏప్రిల్ 14: హరియాణాలోని కైథాల్‌కు చెందిన రాంపాల్ కాశ్యప్ 14 ఏళ్ల క్రితం చేసిన ప్రతిజ్ఞను ప్రధాని మోదీ విరమింపజేశారు. ఆయనకు బూట్లు బహూకరించి ప్రతిజ్ఞను ఉపసంహరింపజేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే వరకు, తాను ఆయనను కలిసే వరకు చెప్పులు వేసుకోనని రాంపాల్ శపథం చేశారు. యమునానగర్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధానిని కలిసే అవకాశం రాంపాల్‌కు వచ్చింది. ఆయనకు బూట్లు బహూకరించిన ప్రధాని వాటిని ధరించాలని కోరారు. మరోసారి ఇలాంటి శపథాలు చేయకూడదని హితవు చెప్పారు. రాంపాల్ అభిమానానికి వినమ్రుడయ్యానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఇవి కూడా చదవండి..