PM Modi: ఇది గర్వించదగ్గ క్షణం
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:17 AM
దేశంలో ఒక బిలియన్(100 కోట్ల) టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది గర్వించదగ్గ క్షణం అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం దేశ ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి, ఆత్మ నిర్భరత విషయంలో మన నిబద్ధతకు అద్దం పడుతుందన్నారు. బొగ్గు రంగంలో పని చేస్తున్న వారి అందరి అంకిత భావానికి ఇది నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.

బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిపై ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): దేశంలో ఒక బిలియన్(100 కోట్ల) టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది గర్వించదగ్గ క్షణం అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం దేశ ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి, ఆత్మ నిర్భరత విషయంలో మన నిబద్ధతకు అద్దం పడుతుందన్నారు. బొగ్గు రంగంలో పని చేస్తున్న వారి అందరి అంకిత భావానికి ఇది నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఇదే విషయమై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా ఆనందం వ్యక్తం చేశారు. 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి ద్వారా దేశం చరిత్రాత్మక మైలు రాయిని దాటిందన్నారు. దేశంలోని విద్యుత్ అవసరాలను తీర్చడమే కాకుండా, దేశ ఆర్థిక వృద్ధికి, యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఈ గొప్ప విజయం ఊతమిస్తుందని ఆయన అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలను తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే