CSK vs MI: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన చెన్నై.. టార్గెట్ ఎంతంటే..
ABN , Publish Date - Mar 23 , 2025 | 09:12 PM
హైదరాబాద్‌లో బ్యాటర్లు అధిపత్యం ప్రదర్శించి పరుగల వరద పారిస్తే.. చెన్నైలో మాత్రం బౌలర్లు తమ సత్తా చూపించారు. అరవీర భయంకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు.

హైదరాబాద్‌లో బ్యాటర్లు అధిపత్యం ప్రదర్శించి పరుగల వరద పారిస్తే.. చెన్నైలో మాత్రం బౌలర్లు తమ సత్తా చూపించారు. అరవీర భయంకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు చెలరేగారు. అద్బుతమైన బౌలింగ్‌తో ముంబై వెన్ను విరిచారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ నాలుగు వికెట్లతో రాణించాడు.
ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండా తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై టీమ్‌ను కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (29), తిలక్ వర్మ (31) ఆదుకున్నారు. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), రాబిన్ మింజ్ (3), నమన్ ధిర్ (17) పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో దీపక్ ఛాహర్ (15 బంతుల్లో 28) బౌండరీలతో విలువైన పరుగులు చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. చెన్నై పిచ్ సాధారణంగా బౌలింగ్‌కు సహకరిస్తుంది. మరి, ఛేజింగ్‌లో చెన్నై బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలి. ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్, దీపక్ ఛాహర్ వంటి బౌలర్లను చెన్నై బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
SRH vs RR: పోరాడి ఓడిన రాజస్తాన్.. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌దే విజయం
SRH vs RR: ఇషాన్ కిషన్ మెరపు శతకం.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..