Saif Ali Attack Case: ఉద్యోగం, పెళ్లి రెండూ పోయాయి.. దాడి అనుమానితుడి ఆవేదన
ABN , Publish Date - Jan 26 , 2025 | 08:42 PM
సైఫ్‌పై దాడి కేసులో ఆకాశ్‌ను అనుమానించిన ముంబై పోలీసులు దుర్గ్‌లో అరెస్టు చేసి రాయపూర్‌కు తరిలించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే నిందితుడు దొరికాడంటూ ఆకాశ్‌ను పోలీసులు విడిచిపెట్టారు.

ముంబై: సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో ముంబై పోలీసులు చేసిన పొరపాటుకు 31 ఏళ్ల ఆకాష్ కైలాశ్ కనోజియా మూల్యం చెల్లించుకున్నాడు. అనుమానితుడిగా భావించి అతన్ని పోలీసులు తొలుత అరెస్టు చేశారు. దీంతో అతని డ్రైవర్ ఉద్యోగం పోయింది. ఖాయమైందనుకున్న పెళ్లి సంబంధం కూడా చెడిపోయింది. ఇంక కనుచూపు మేరలో తనకు పెళ్లయ్యే అవకాశమే లేదని ఆకాశ్ తాజాగా ఆవేదన వ్యక్తం చేశాడు. సైఫ్‌పై దాడి కేసులో ఆకాశ్‌ను అనుమానించిన ముంబై పోలీసులు దుర్గ్‌లో అరెస్టు చేసి రాయపూర్‌కు తరిలించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే నిందితుడు దొరికాడంటూ ఆకాశ్‌ను పోలీసులు విడిచిపెట్టారు.
Republic Day: చెత్త తీసేసిన ప్రధాన నరేంద్ర మోదీ
''కాబోయే భార్యను కలుసుకునేందుకు వెళ్తుండగా నన్ను అరెస్టు చేసి రాయపూర్‌కు తరలించారు. నా ఫోటోలు మీడియాకు రిలీజ్ చేయడంతో టెలివిజన్ ఛానెళ్లు, మీడియా సంస్థల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో కుదిరిందనుకుంటున్న నా పెళ్లి సంబంధం చెడిపోయింది. మా యజమాని ఉద్యోగం నుంచి తొలగించాడు'' అని కైలాశ్ వాపోయాడు. దాడితో తనకు సంబంధం లేదని, తన కుటుంబ సభ్యులతో మాట్లాడమని, తన ఇంటివద్ద సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించమని తాను ఎంతగా బతిమాలినా పోలీసులు వినిపించుకోలేదని, పైగా తన ఫోటోలు మీడియాకు విడుదల చేశారని చెప్పాడు. అయితే జనవరి 18న షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే నిందితుడు పట్టుబడటంతో తనను విడిచిపెట్టారని తెలిపాడు.
సైఫ్ ఇంటివద్ద కనుగొన్న సీసీటీవీలోని వ్యక్తికి మీసాలు లేవని, తనకు మీసాలు ఉన్నాయని, పోలీసులు ఈ చిన్న తప్పిదాన్ని ఎందుకు గుర్తించలేకపోయారో తనకు అర్ధం కావడం లేదని ఆకాష్ చెప్పాడు. ఆకాష్‌ను అదుపులోకి తీసుకున్న మరుసటి రోజే బంగ్లాదేశ్‌కు చెందిన షరిపుల్ ఇస్లామ్ షెహజాద్ అలియాస్ విజయ్‌దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి:
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్..
Read More National News and Latest Telugu News