Canada: కెనడాలో పంజాబీ డాన్
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:42 AM
పంజాబ్‌కు చెందిన నిమ్మా తన పాటల ద్వారా జాతివివక్ష, జాత్యాహంకారంపై పోరాటం చేస్తాడు. కొన్ని మాఫియా శక్తులు పగబట్టి అతన్ని వేటాడతాయి. తనను మట్టుపెట్టాలని చూస్తున్న గ్యాంగ్‌స్టర్స్ బారి నుంచి కాపాడుకోవడానికి అతనే ఓ ముఠాను ఏర్పాటు చేసి డాన్‌గా మారతాడు.

ఓ పంజాబీ యువకుడు కెనడా వెళ్లి డాన్‌గా ఎదిగిన కథతో తెరకెక్కిన సిరీస్ ‘కన్నెడ’. తమ కలలను నిజం చేసుకునేందుకు విదేశాలకు వెళ్లే భారతీయులు అక్కడ పడే కష్టాలను ఈ సిరీస్ ఆవిష్కరిస్తుంది. 1990ల్లో కెనడా నేపథ్యంలో కథ సాగుతుంది. పంజాబ్‌కు చెందిన నిమ్మా తన పాటల ద్వారా జాతివివక్ష, జాత్యాహంకారంపై పోరాటం చేస్తాడు. కొన్ని మాఫియా శక్తులు పగబట్టి అతన్ని వేటాడతాయి. తనను మట్టుపెట్టాలని చూస్తున్న గ్యాంగ్‌స్టర్స్ బారి నుంచి కాపాడుకోవడానికి అతనే ఓ ముఠాను ఏర్పాటు చేసి డాన్‌గా మారతాడు. చందన్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీ్‌సలో పర్మీష్ వర్మ, రణ్‌వీర్ షోరే, జాస్మిన్ బజ్వా కీలకపాత్రలు పోషించారు.