Khaki: ఖాకీతో మాఫియా పోరు
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:40 AM
కోల్‌కతాలో మాఫియా చేతిలో ప్రభుత్వ అధికారులు హత్యకు గురవ్వడం, క్రిమినల్స్ అరాచకాలు పెరిగిపోవడం... శాంతి భద్రతలను కాపాడేందుకు ఐపీఎస్ అర్జున్ మైత్రా ఏం చేశాడనేది కథ.

తుషార్ కాంతిరే దర్శకత్వంలో శీతల్ భాటియా నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’. గతంలో వచ్చిన ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’కు ఇది సీక్వెల్. కోల్‌కతాలో మాఫియా చేతిలో ప్రభుత్వ అధికారులు హత్యకు గురవ్వడం, క్రిమినల్స్ అరాచకాలు పెరిగిపోవడం... శాంతి భద్రతలను కాపాడేందుకు ఐపీఎస్ అర్జున్ మైత్రా ఏం చేశాడనేది కథ. శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్స్, అవినీతి రాజకీయ నాయకుల బారి నుంచి సామాన్య ప్రజలను రక్షించేందుకు పోలీస్ వ్యవస్థ జరిపిన పోరును ఆసక్తికరంగా తెరకెక్కించారు. హిందీ, బెంగాలీ భాషల్లో తెరకెక్కిన ఈ సిరీ్‌సలో జీత్, ప్రసేన్ జిత్ చటర్జీ, చిత్రాంగద సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు.